Breaking News

బిగ్‌బాస్‌ 6 టైటిల్‌ నాదే.. వైరల్‌గా సింగర్‌ రేవంత్‌ పోస్ట్‌

Published on Sat, 09/03/2022 - 21:05

హౌజ్‌లో ఇంకా అడుగు పెట్టకుండానే టైటిల్‌ నాదే అంటూ ధిమా వ్యక్తం చేశాడు సింగర్‌ రేవంత్‌. అయితే అందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ తాజాగా ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశాడు. బుల్లితెర ప్రేక్షకులంతా ఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ 6వ సీజన్‌ రేపు గ్రాండ్‌గా లాంచ్‌ కాబోతుంది. హౌజ్‌లో అడుగుపెట్టేది వీరేనంటూ కంటెస్టెంట్‌ ఫైనల్‌ లిస్ట్‌ ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఈ జాబితాలో ఇండియన్‌ ఐడల్‌ విజేత సింగర్‌ రేవంత్‌ ఉన్న సంగతి తెలిసిందే.

చదవండి: పవన్‌ కల్యాణ్‌కి విషెస్‌ చెప్పని బన్నీ, కారణమిదేనా?

తాజాగా ఇదే విషయాన్ని కన్‌ఫాం చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ షేర్‌ చేశాడు రేవంత్‌. ‘జీవితంలో కొన్నింటిని త్యాగం చేయడం చాలా కష్టం... నా కుటుంబాన్ని మిస్‌ అవుతాను. ముఖ్యం నా భార్యను అలాగే నా సంగీతాన్ని. కానీ ఓ భగీరథుడి సాధనలా గెలిచి మంచి పేరుతో బయటికు వస్తాను. త్వరలోనే మీ అందరి కలుసుకుంటా. ఓటింగ్స్‌ ద్వారా మీ అందరి ప్రేమ, మద్దతు కావాలి. మీ అందరిని అలరించేందుకు చివరి రంగం సిద్ధమైంది. మీ అందరి ప్రేమ, ఆశ్వీర్వాదంతో టైటిల్‌ గెలిచి వస్తాను’ అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసి అతడి ఫ్యాన్స్‌ ‘ఆల్‌ ది బెస్ట్’ అంటూ రేవంత్‌ని విష్‌ చేస్తున్నారు. 

చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి

కాగా బిగ్‌బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులతో ఎలాంటి కాంటాక్ట్‌ కానీ, అసలు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మూడు నెలల పాటు హౌజ్‌లో ఉండాలనేది బిగ్‌బాస్‌ రూల్‌. అంతేకాదు హౌజ్‌లో అడుగుపెట్టేవరకు కంటెస్టెంట్స్‌ ఎవరూ తాము బిగ్‌బాస్‌ ఆఫర్‌ అందుకున్న విషయాన్ని బయటకు లీక్‌ చేయొద్దు. అది బిగ్‌బాస్‌ రూల్‌. కానీ రేవంత్‌ ఇంకా బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగు పెట్టకుండానే అఫిషియల్‌గా పోస్ట్‌ షేర్‌ చేయడం అందరిని ఆశ్యర్యపరుస్తోంది. మరి ఇది బిగ్‌బాస్‌ పర్మిషన్‌తోనే చేశాడా? లేక ఆత్రుత ఆగలేక తొందరపడి పెట్టేశాడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)