Breaking News

విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు తెలిపిన సింగర్.. ఎందుకంటే?

Published on Sun, 05/18/2025 - 18:32

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రముఖ సింగర్ రాహుల్ వైద్య కృతజ్ఞతలు తెలిపారు. తనను సోషల్ మీడియాలో అన్‌బ్లాక్ చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కాగా.. గతంలో కోహ్లీ, అతని ‍అభిమానులను ఉద్దేశించి జోకర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో సింగర్‌ రాహుల్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కోహ్లీ బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని సింగర్‌ కూడా వెల్లడించాడు.

తాజాగా అన్‌బ్లాక్ చేయడంతో కోహ్లీపై ప్రశంసలు కురిపించారు సింగర్ రాహుల్ వైద్య. భారత క్రికెట్‌కు ఆయన చేసిన కృషిని ప్రశంసిస్తూ వరుస పోస్టులు పెట్టారు. నన్ను అన్‌బ్లాక్ చేసినందుకు మీకు ధన్యవాదాలు.. ప్రపంచ క్రికెట్‌లో  ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో మీరు ఒకరని కోహ్లీని కొనియాడారు. మీరు భారతదేశానికి గర్వకారణమని.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఎప్పుడు దీవించాలని కోరుకుంటున్నట్లు సింగర్ రాసుకొచ్చాడు.

గతంలో తలెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ..'నా భార్య, సోదరిని ఉద్దేశించి చాలా అసభ్యంగా కామెంట్స్ చేశారు. నా చిన్నకూతురు చిత్రాలను మార్ఫింగ్ చేశారు. నా కుటుంబానికి ద్వేషపూరిత సందేశాలను పంపిన వ్యక్తులకు ఆ దేవుడు కొంత జ్ఞానం ప్రసాదించుగాక. నేను కూడా అంతకంటే దారుణంగా స్పందించగలను. కానీ నేను అలా చేయను. ఎందుకంటే అది మరింత ప్రతికూలతకు కారణమవుతుంది. వికాస్ కోహ్లీ (విరాట్ సోదరుడు) మీరు నాకు ఏమి చెప్పినా నాకు చెడుగా అనిపించలేదు. ఎందుకంటే మీరు మంచివారని నాకు తెలుసు. మాంచెస్టర్ స్టేడియం వెలుపల మిమ్మల్ని కలవడం, నా పాట గురించి మీరు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అందరు ప్రేమ, శాంతి ఉండాలని కోరుకుంటున్నా' అంటూ తన పోస్ట్‌లో వివరణ ఇచ్చారు. కాగా.. గతంలో విరాట్ కోహ్లీ అభిమానులు విరాట్ కంటే పెద్ద జోకర్లు అంటూ సింగర్ కామెంట్‌ చేశాడు. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్‌ అతనిపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)