Breaking News

నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్‌ చేశారో చూశారా?: సింగర్‌ ప్రవస్తి

Published on Thu, 06/26/2025 - 08:34

సింగింగ్‌ రియాలిటీ షో పాడుతా తీయగాలో తనను బాడీ షేమింగ్‌ చేశారని, పక్షపాతం చూపిస్తున్నారంటూ అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించింది సింగర్‌ ప్రవస్తి. తన ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌కి సునీత తప్ప ఎవరూ లేరంది. కానీ, రీసెంట్‌గా ఆ ఎలిమినేషన్‌కు సంబంధించిన ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అవగా.. అందులో ముగ్గురు జడ్జిలు (సునీత, చంద్రబోస్‌, కీరవాణి) చప్పట్లు కొడుతూ కనిపించారు.

ఇంత అనైతికంగా..
దీని గురించి ప్రవస్తి ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఈ వివాదం గురించి ఇక మాట్లాడకూడదనుకున్నాను. కానీ నిన్నటి ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌ చూశాక స్పందించాల్సి వస్తోంది. ఆ ఎపిసోడ్‌ చూసి చాలా షాకయ్యాను. రియాలిటీ షో చరిత్రలోనే ఇంత అనైతికంగా ఎడిటింగ్‌లు చేసి ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ చేస్తారనుకోలేదు. ఎడిట్‌ చేస్తారని తెలుసు. ఎలాగంటే అక్కడక్కడా ముక్కలు అతికిస్తారనుకున్నా.. కానీ, ఇంత అన్‌ప్రొఫెషనల్‌గా చేస్తారని మాత్రం ఊహించలేదు.

మోసం చేయొచ్చని
మీరే చాలామంది రియలైజ్‌ అయి నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. మిగిలిన ఎలిమినేషన్స్‌తో పోల్చుకుంటే ఇది అన్యాయంగా ఉందని కామెంట్లు చేశారు. మీరు చెప్పేది నిజమే.. చాలా ఎడిట్‌ చేశారు. జనాలను ఈజీగా మోసం చేయొచ్చని వారి ఉద్దేశం. అదే నాకు ఎంతో బాధనిపించింది. నా ఎలిమినేషన్‌ అప్పుడు సునీత మేడమ్‌ తప్ప మిగతా జడ్జిలు లేరని చెప్పాను. చంద్రబోస్‌ సర్‌ లేనే లేరు. కీరవాణి సార్‌.. నాకు సంబంధం లేదని లేచి వెళ్లిపోయారు. అది ఎడిటింగ్‌లో లేపేశారు.

ఎక్కడినుంచి తీసుకొచ్చి అతికించారో..
కానీ ఆయన చప్పట్లు కొడుతున్న సీన్‌ పెట్టారు. అది ఎక్కడినుంచి తీసుకొచ్చి అతికించారో నాకు తెలీదు. ఎలిమినేషన్‌లో చప్పట్లు కొట్టే సీన్‌ ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియాలి. చివరి రౌండ్‌లో ఇద్దరం మిగిలాం. నన్ను ఎలిమినేట్‌ చేసినప్పుడు నాకెన్ని మార్కులు వచ్చాయి? ఎందుకు ఎలిమినేట్‌ చేశారు? అనేది చూపించలేదు. నేనైతే ఆ ఎలిమినేషన్‌ ప్రక్రియ మొత్తం నవ్వుతూనే ఉన్నాను. 

ఎలిమినేట్‌ అవడమే బెటర్‌
ఎందుకంటే, ఇంత అన్‌ప్రొఫెషనల్‌ రియాలిటీ షోలో ఉండటం అనవసరం అనిపించింది. ఈ సీజన్‌ ఇంత ఘోరంగా జరుగుతుంటే ఎలిమినేట్‌ అవడమే బెటర్‌ అనుకున్నాను. అలాగే చూసే జనాలకు కూడా నిజాలు తెలియాలనుకున్నాను. వాళ్లు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పాలని ఆరోజే నిర్ణయించుకున్నాను. అక్కడ సేవ్‌ అయిన కంటెస్టెంట్ల కంటే కూడా నా ముఖంలోనే చిరునవ్వు ఉంది. నేను మిస్టేక్స్‌ చేయలేదు. 

ద్వేషం లేదు
సేవ్‌ అయినవాళ్లను చూస్తే తప్పులు చేసినా కూడా సేవ్‌ అయ్యాం అని గిల్ట్‌ వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వారిపై నాకెలాంటి ద్వేషం లేదు. నాకు అన్యాయం జరిగిందని ఇదంతా మాట్లాడుతున్నాను. ప్రేక్షకులను ఫూల్‌ చేస్తున్నారని తెలియాలనే ఇదంతా చేశాను. విన్నర్‌ అయినా కూడా వారికి ఆ సంతృప్తి మిగులుతుందనుకోవడం లేదు. వాళ్లకు నచ్చినవారే గెలుస్తారు అని చెప్పుకొచ్చింది.

   

చదవండి: క్రికెట్‌ వీడియోపై నెటిజన్ వ్యంగ్య కామెంట్‌.. ఇచ్చిపడేసిన తమన్‌!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)