ప్రముఖ లేడీ సింగర్‌కి అరుదైన వ్యాధి.. ఫలితంగా చెవుడు!

Published on Tue, 06/18/2024 - 14:07

ప్రముఖ లేడీ సింగర్ అరుదైన వ్యాధి బారిన పడింది. దీని వల్ల ఆమెకు చెవుడు వచ్చింది. అసలేం జరిగిందో.. ఈ వ్యాధి వచ్చిన విషయాన్ని ఎలా కనుగొందో వివరంగా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇన్ స్టా పోస్ట్ పెట్టి వివరించింది. 1990ల టైంలో బాలీవుడ్‌లో టాప్ సింగర్స్‌లో ఒకరైన అల్కా యాగ్నిక్.. ఇప్పుడు సెన్సోరిన్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్‌తో బాధపడుతోంది. అనుకోని వైరల్ ఎటాక్ కారణంగానే దీని బారిన పడ్డానని, సోకే వరకు దీని గురించే తెలియదని ఎమోషనల్ అయిపోయింది.

(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే ప్రభాస్ 'కల్కి' మరో రికార్డ్.. ఈసారి ఏకంగా!)

'నా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫాలోవర్స్.. కొన్ని వారాల క్రితం నేను విమానం దిగి వస్తుంటే.. నాకేం వినబడలేదు. గత కొన్నిరోజుల నుంచి నేను ఎందుకు కనిపించట్లేదు అని అడిగిన వాళ్ల కోసం ఇప్పుడు చెబుతున్నా. నేను ఓ అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ సమస్యతో బాధపడుతున్నా. ఈ విషయాన్ని డాక్టర్లు చెప్పారు. వైరల్ ఎటాక్ వల్ల ఇలా జరిగింది. దీన్ని నేను అస్సలు ఊహించలేదు. ఒక్కటే చెబుతున్నా. పెద్ద సౌండ్‌తో  పాటలు వినడం, హెడ్ ఫోన్స్ వాడకం తగ్గించండి. త్వరలోనే నేను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను' అని అల్కా యాగ్నిక్ చెప్పుకొచ్చింది.

90ల్లో హిందీలో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన అల్కా యాగ్నిక్.. పలు రియాలిటీ షోల్లో జడ్జిగా వ్యవహరించింది. ఇప్పటివరకు 25 భాషల్లో 21 వేలకు పైగా పాటలు ఈమె పాడటం విశేషం. అలానే 2022లో మోస్ట్ స్ట్రీమ్డ్ ఆర్టిస్టుగా గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఆ ఏడాది 15.3 బిలియన్ వ్యూస్‌ని ఆల్కా పాటలు సాధించడం విశేషం.

(ఇదీ చదవండి: ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?)

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)