Breaking News

సింగర్‌ అద్నాన్ సమీకి మాతృ వియోగం

Published on Mon, 10/07/2024 - 15:16

గాయకుడు అద్నాన్ సమీ  తల్లి బేగమ్‌ నౌరీన్ సమీ ఖాన్ (77) అనారోగ్యంతో మరణించారు.  తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అద్నాన్‌ సమీ ప్రకటించారు. బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా అద్నాన్‌ సమీ సూపర్‌ హిట్‌ పాటలు పాడారు. ఈ క్రమంలో ఆయన భారీగా అభిమానులను సంపాధించుకున్నారు.

అద్నాన్‌ సమీ తన తల్లి ఫోటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ' నాకెంతో ఇష్టమైన మా అమ్మ  బేగం నౌరీన్ సమీ ఖాన్ మరణ వార్తను ప్రకటించడం చాలా బాధగా ఉంది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ సమయంలో చెప్పలేనంత దుఃఖంతో మా కుటుంబం మునిగిపోయి ఉంది. ఆమె  ప్రతి ఒక్కరికి ప్రేమ,  ఆనందాన్ని పంచింది. ఆమెను కోల్పోయామనే నిజాన్ని నమ్మలేకపోతున్నాం.' అని అద్నాన్‌ పేర్కొన్నారు.

అద్నాన్‌ సమీ అభిమానులు,  సన్నిహితులు  ఆమె మరణం పట్ల సంతాపం తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన అద్నాన్ సమీ భారతీయ పౌరసత్వం పొందారనే విషయం తెలిసిందే. అద్నాన్‌ తండ్రి అర్షద్ సమీ ఖాన్ పాకిస్థాన్‌కు చెందగా.. ఆయన తల్లి నౌరీన్ ఖాన్ జమ్మూకి చెందినవారు. అద్నాన్ తండ్రి పాకిస్తాన్ వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. ఆయన సుమారు 15 దేశాలకు పైగానే పాకిస్తాన్ రాయబారిగా కూడా పనిచేశాడు. కానీ అద్నాన్ సమీ మాత్రం భారత్‌లో పాపులర్‌ సింగర్‌గా స్థిరపడ్డారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)