సొంత టీడీపీ కార్యకర్తపైనే... ప్రశ్నించాడని పోలీసులతో ఈడ్చుకెళ్లి.. బండారు శ్రావణి రెడ్ బుక్ రూల్
Breaking News
జూన్‌లో సింగ్ గీతం
Published on Sat, 05/02/2026 - 06:24
మూకీ చిత్రం ‘పుష్పక్’, టాకీ సినిమాలు ‘విచిత్ర సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజన్ ’, ‘ఆదిత్య 369’ వంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలోని తాజా సినిమాకు ‘సింగ్ గీతం’ అనే టైటిల్ ఖరారైంది. 94 సంవత్సరాల వయసులో ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ మ్యూజికల్ ఫాంటసీ సినిమాలో అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పతాకంపై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, ఈ సినిమాను జూన్ 11న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. ‘కుబేరపురం... అసలు ఎందుకు వదిలేసి వెళ్లిపోయాడు అంకుల్ మా నాన్న ఈ ఊరిని... రాజా ట్రీట్మెంట్ ఇక్కడ..., మనకు ఒక ఫారిన్ డీల్ ఓకే అయ్యింది’ అనే డైలాగ్స్ ఈ సినిమా టీజర్లో ఉన్నాయి. ‘‘ఒక మిస్టీరియస్ విలేజ్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది.
ప్రతాప్ అనే యువకుడి కథ చుట్టూ తిరుగుతుంది. అవకాశాల కోసం ప్రయత్నించే ప్రతాప్ జీవితం అనుకోని మార్గం లోకి వెళుతుంది. కనిపించేదంతా నిజం కాని ప్రపంచంలోకి అడుగుపెడతాడు. దీంతో ఓ సంఘర్షణలో చిక్కుకుని తన నిర్ణయాలు, నమ్మకాలు, లక్ష్యాలను ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది. యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Tags : 1