Breaking News

సింగీతం శ్రీనివాసరావు కొత్త సినిమా ప్రకటన

Published on Sat, 01/31/2026 - 21:11

లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు 94ఏళ్ల వయసులో మళ్లీ మెగా ఫోన్‌ పెట్టారు. దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తెరకెక్కించారు. తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకలోకాన్ని  పుష్పక విమానంపై ఊయలలూగించారు. జానపదాన్ని ప్రేమించడమేకాదు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అద్భుత ప్రయోగాలతో అపురూప కళాఖండాలను ఆవిష్కరించిన తెరమాంత్రికుడాయన. కేవలం దర్శకుడిగానే కాదు, సంగీతంలోను ఔరా అనుపించుకున్నారు.  ఆదిత్య 369, భైరవ ద్వీపం, పుష్పక విమానం, మయూరి, బృందావనం వంటి అద్భుతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు.

ప్రయోగాత్మక చిత్రాలు తీయాలంటే సింగీతం శ్రీనివాసరావు తర్వాతనే ఎవరైనా అనేలా చెరగని ముద్ర వేశారు. చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన ఒక కొత్త సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.‌ ఈ చిత్రాన్ని  వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తుండగా రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌  సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ మూవీని ప్రకటిస్తూ చిత్ర యూనిట్‌ ఒక వీడియోను పంచుకుంది. అయితే, సినిమా పేరుతో పాటు నటీనటుల విషయాలను త్వరలో ప్రకటించనున్నారు.

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)