Breaking News

ఐశ్వర్యను దూరం పెట్టిన బిగ్‌బీ? నటి ఏమందంటే..?

Published on Thu, 09/26/2024 - 20:37

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామిలీలో అంతర్గత విభేదాలున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. బిగ్‌బీ తనయుడు అభిషేక్‌, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారని రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఐష్‌కు, తన అత్త జయా బచ్చన్‌కు సఖ్యత లేదని కూడా ఓ గాసిప్‌!

ఐశ్వర్యను పట్టించుకోని బిగ్‌బీ?
ఈ విషయంలో సోషల్‌ మీడియా అంతా ఐష్‌కు సపోర్ట్‌గా ఉండగా బిగ్‌బీ కుటుంబాన్ని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో ఓ యాంకర్‌ సైతం అమితాబ్‌ను విమర్శించింది. ఆయన తన కూతురికి అండగా ఉంటాడు కానీ ​కోడలు ఐశ్వర్యను మాత్రం అస్సలు పట్టించుకోడు. కూతురు, కొడుకు ఫోటోలు షేర్‌ చేస్తుంటారే తప్ప ఐష్‌ అవార్డు పొందితే దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరు అని ఆరోపించింది. ఈ వీడియో సీనియర్‌ నటి సిమి గరెవాల్‌ కంట్లో పడింది.

ఇక చాలు ఆపండని నటి వార్నింగ్‌
బచ్చన్‌ కుటుంబం గురించి మీకసలు ఏదీ తెలియదు.. ఇక చాలు, ఆపేయండి అని వార్నింగ్‌ ఇచ్చింది. కాగా సిమి గరెవాల్‌.. మేరా నామ్‌ జోకర్‌ సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది. సిద్దార్థ, కభి కభీ, కార్జ్‌ వంటి చిత్రాల్లో నటించింది.

చదవండి: Krystle DSouza: రెండు రోజులు బ్రేక్‌ లేకుండా షూటింగ్‌.. కింద పడిపోయినా వదల్లేదు!

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)