Breaking News

శింబు కోసం రాలేదు, కానీ ఒక్కటి అడుగుతా..: హీరో తండ్రి

Published on Wed, 04/08/2026 - 10:35

కోలీవుడ్‌ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'అరసన్‌'. వెట్రిమారన్‌ దర్శకత్వంలో కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ రెండో షెడ్యూల్‌ చైన్నెలో జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ షూటింగ్‌ను తమిళ సినీ నిర్మాతల మండలి, పెప్సీ కలిసి నిలిపేసినట్లు సమాచారం. ఈ విషయంపై శింబు తండ్రి, దర్శక నిర్మాత టి.రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అరసన్‌ చిత్రం కోసమో, శింబు కోసమో వాదించడానికి నేను రాలేదు. 

ఆ గొడవ ఎప్పుడో అయిపోయింది
తమిళ చిత్ర నిర్మాతల మండలి, దానికి సహకరిస్తున్న దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధర్మంగా ప్రవర్తించకూడదని చెప్పడానికే నేను వచ్చాను. ఇంతకు ముందు శింబు నటించిన 'వెందు తనిందదు కాడు' చిత్ర నిర్మాత ఐసరి గణేష్‌.. శింబుకు వ్యతిరేకంగా చైన్నె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన తర్వాతి సినిమా కోసం రూ.5 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చారు కానీ ఆ మూవీ పట్టాలెక్కలేదు. అయితే ఈ కేసులో శింబు సరసన చట్టపరంగా నేను పోరాడి గెలిచాను. నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్‌ శింబుకే చెందుతుంది అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ నకళ్లు నా చేతిలోనే ఉన్నాయి. 

నటుడికి మద్దతుగా నిలబడరా?
ఇలాంటి పరిస్థితుల్లో ఆ పాత కేసును దృష్టిలో పెట్టుకుని నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య.. ఈ రోజు అరసన్‌ చిత్ర షూటింగ్‌ను నిలిపివేసినట్లు తెలిసింది. ఈ విషయంలో నేడు అడగదలచుకున్నది ఒక్కటే. ఒక నిర్మాత కోసం నిర్మాతల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య పోరాడుతుంటే ఒక నటుడికి దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎందుకు మద్దతుగా నిలబడడం లేదు. ఈ సంఘం నటుడికి మద్దతుగా నిలబడాలి. అతడికి న్యాయం చేయాలి. మంచి పరిష్కారాన్ని చూపాలి అని టి.రాజేంద్రన్‌ పేర్కొన్నారు.

చదవండి: నయనతార సర్‌ప్రైజ్‌.. ఎమోషనలైన విఘ్నేశ్‌ శివన్‌

Videos

బాబుకు ప్రతి రోజూ సినిమా చూపిస్తా.. జగన్ సంచలన వ్యాఖ్యలు

త్వరలో పాదయాత్ర.. వైఎస్ జగన్ క్లారిటీ

దమ్ము లేని దద్దమ్మ.. ఏబీఎన్ రాధాకృష్ణపై అంబటి ఫైర్

ఎక్కడ దాక్కున్నావ్.. బయటకు రా! రాధాకృష్ణకు పోతిన మహేష్ వార్నింగ్

జగన్ విధానం కాదనడానికి నువ్వెవడివి, బుడమేరు పొంగినప్పుడు హై కోర్ట్ 5 రోజులు సెలవు

ఇరాన్ కు కోలుకోలేని దెబ్బ! కోమా లో కొత్త సుప్రీం లీడర్...

అందుకే బన్నీ గ్రేట్ అంటున్న టాలీవుడ్

లక్షను 26 లక్షలు చేసింది.. ఐదేళ్లలో కాసుల పంట పండించిన స్టాక్..!

YSRCP నేతలతో వైఎస్ జగన్ @తాడేపల్లి

అంబటి VS పోలీస్ మాట్లాడకుండా ఇచ్చిపడేసాడు

Photos

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)

+5

అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. బన్నీ అరుదైన రికార్డులివే! (ఫోటోలు)

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)