Breaking News

కామెడీ ఎంటర్‌టైనర్‌

Published on Tue, 11/11/2025 - 02:28

ప్రముఖ తమిళ హీరో విజయ్‌ తనయుడు జాసన్‌ సంజయ్‌ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. సందీప్‌ కిషన్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘సిగ్మా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు మేకర్స్‌. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్‌ జాపీ, సంపత్‌ రాజ్, కిరణ్‌ కొండ, మహాలక్ష్మి, సుదర్శనన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సిగ్మా’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసి, ఫస్ట్‌ లుక్‌పోస్టర్‌ విడుదల చేశారు. బంగారం, నోట్ల కట్టల మధ్య కూర్చొని చేతికి బ్యాండేజ్‌ కడుతున్నట్లు కనిపించారు సందీప్‌. 

జాసన్‌ సంజయ్‌ మాట్లాడుతూ–‘‘యాక్షన్, అడ్వెంచర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘సిగ్మా’. ఈ టైటిల్, కాన్సెప్ట్‌ ‘సిగ్మా’ అనే స్వతంత్ర, ధైర్యవంతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ట్రెజర్‌ హంట్, హీస్ట్, కామెడీ అంశాల మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ అనుభూతిని అందిస్తుంది. ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది. త్వరలోనే పోస్ట్‌ప్రోడక్షన్‌ ప్రారంభించి వేసవి ప్రారంభంలో సినిమా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ‘‘తొలి సినిమా దర్శకునిగా జేసన్‌ సంజయ్‌ 65 రోజుల్లో 95శాతం షూటింగ్‌ పూర్తి చేయడమంటే అసాధారణ విజయమే’’ అన్నారు లైకాప్రోడక్షన్స్  సీఈఓ తమిళ్‌ కుమారన్‌. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: కృష్ణన్‌ వసంత్‌.

Videos

అజిత్ దోవల్ తో మోదీ భేటీ.. టెర్రరిస్టులకు బిగ్ వార్నింగ్

మొయినుద్దీన్ విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Red Fort: ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ జారీ చేసిన కేంద్రం

సనాతన ధర్మం అంటూ పవన్ డబుల్ యాక్షన్

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం బాబు Vs జగన్ మధ్య తేడా ఇదే..

మహిళపై టీచర్ అత్యాచార యత్నం

తిరుపతిలో అయ్యప్ప భక్తులకు అవమానం

విలన్ గా ఉపేంద్ర... సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాక్..!

YSRCP నేత ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం

Photos

+5

'గత వైభవం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్‌ వద్ద భారీ పేలుడు (చిత్రాలు)

+5

తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)