Breaking News

డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా?

Published on Fri, 09/03/2021 - 13:40

RIP Sidharth Shukla: బాలీవుడ్‌ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మృతితో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 40 ఏళ్ళకే యువనటుడు గుండెపోటుతో మృతి చెందడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. తీవ్రమైన గుండెపోటు రావడంతో గురువారం ఉదయం 10.30 నిమిషాలకు  సిద్ధార్థ్ తుదిశ్వాస విడిచారు. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉల్లాసంగా కనిపించే సిద్ధార్థ్ లేడన్న వార్త అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సిద్ధార్థ్ ఘటన జరగడానికి ముందురోజు సైతం వర్కవుట్స్‌ చేసినట్లు సమాచారం.

చదవండి : సిద్ధార్థ్ శుక్లా చివరి క్షణాలు ఇవేనంటూ వీడియో వైరల్‌.. నిజం ఏంటంటే?

రాత్రి 8గంటలకు ఇంటికి చేరుకున్న  సిద్ధార్థ్..పది గంటల సమయంలో జాగింగ్‌తో పాటు కొన్ని వర్కవుట్స్‌ చేశాడని తెలుస్తుంది. అనంతరం నిద్రపోయే ముందు అతను కొన్ని మెడిసిన్స్‌​ తీసుకున్నాడని, అయితే తెల్లవారుజామున 3గంటలకు ఛాతిలో నొప్పి రావడంతో తన తల్లికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె స్వయంగా నీళ్లు తాగించిందని, అనంతరం  నిద్రపోయిన సిద్ధార్థ్ మళ్లీ మేల్కోలేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సిద్ధార్థ్‌ ప్రతిరోజు క్రమం తప్పకుండా దాదాపు 3గంటల పాటు వ్యాయామం చేసేవాడట. అయితే వర్కవుట్‌ సమయాన్ని కాస్త కుదించమని ఇటీవలె వైద్యులు సలహా ఇచ్చినట్లు సమాచారం. తీవ్రమైన వర్కవుట్స్‌ కూడా ప్రమాదమేనని వైద్యులు అంటున్నారు. ఆర్థిక జీవనశైలితో పాటు ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే గుండెపోటు తలెత్తడం వంటివి జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. శారీరక దాడృత్యంతో పాటు మాససిక ప్రశాంతత కూడా ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు. 

చదవండి : Sidharth Shukla: ఆరోజు రాత్రి ఏం జరిగింది.. పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది?

Videos

కూటమి నేతలు దిగజారిపోతున్నారు.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ పై సీరియస్

రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, అరెస్ట్

Exclusive Interview: నేను సంపాదించిన డబ్బులో కొంత ఛారిటీకే

పవన్ పై పిఠాపురం రైతులు ఫైర్

వల్లభనేని వంశీ కేసు కోసం ఢిల్లీ బాబాయ్ కి 2 కోట్లు ఖర్చుపెట్టారు..

భారతీయులకు ట్రంప్ మరో షాక్..

Big Question: ఏపీలో పిచ్చి కుక్కలా రెడ్ బుక్.. హడలిపోతున్న పారిశ్రామికవేత్తలు

Magazine Story: నాడైనా, నేడైనా నేనే లిక్కర్ బాద్ షా..!

మళ్ళీ ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 2025

కలర్ ఫుల్ బ్యూటీస్

Photos

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)

+5

'వచ్చినవాడు గౌతమ్‌' సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)