Breaking News

తొలిప్రేమ.. ఆ అమ్మాయి ఇన్‌స్టా ఇప్పటికీ చూస్తుంటా: సిద్ధు

Published on Sun, 10/12/2025 - 07:26

టాలీవుడ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ డ్రామా చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). ఈ మూవీ అక్టోబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా సిద్ధు పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రేమ కథను పంచుకున్నారు. ‘తెలుసు కదా’ చిత్రంలో  రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, టి.జి.కృతిప్రసాద్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు.  నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు.

ఇద్దరిని ప్రేమించిన ఓ యువకుడి స్టోరీతో తెలుసు కదా చిత్రం తెరకెక్కింది. అయితే, తన నిజ జీవితంలోని ప్రేమకథను కూడా సిద్ధు జొన్నలగడ్డ ఇలా పంచుకున్నారు. 'నేను ఏడో తరగతిలోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. పదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం. కానీ, ఆ అమ్మాయితో నా ప్రేమ గురించి చెప్పలేదు. ఇంతలోనే పదో తరగతి పరీక్షలు పూర్తి అయ్యాయి. చివరి రోజున శ్లామ్ బుక్ తీసుకొని తన వద్దకు వెళ్లాను.  ఒక కొటేషన్‌తో పాటు తన ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ కూడా అందులో రాసింది. చివరిసారిగా నా నుంచి వెళ్తూ.. ఓ లుక్‌ ఇచ్చి సైకిల్‌పై వెళ్లిపోయింది. ఇప్పటికీ ఆ సీన్‌ నా కళ్ల ముందే తిరుగుతుంది. కానీ, ఆ తర్వాత కూడా ఎప్పుడూ నా ప్రేమ విషయాన్ని ఆమెతో పంచుకోలేదు. కొన్నేళ్ల తర్వాత తనకు పెళ్లి కూడా అయిపోయింది. పిల్లలు కూడా పుట్టేశారని తెలిసింది. ఆమెతో నేరుగా మాట్లాడకపోయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రొఫైల్‌ అప్పుడప్పుడు చూస్తుంటాను.' అని సిద్ధు చెప్పాడు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)