Breaking News

సినీ నటిపై సీనియర్‌ నటుడి ఫిర్యాదు

Published on Mon, 08/26/2024 - 15:24

మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం పెద్ద దుమారమే రేగుతుంది. మలయాళ ప్రముఖ నటుడు సిద్ధిఖీపై నటి రేవతి సంపత్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనపై సిద్ధిఖీ అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. అయితే, తాజాగా నటి రేవతి సంపత్‌పై డీజీపీకి సిద్ధిఖీ ఫిర్యాదు చేశారు. చాలా ఏళ్లుగా ఆమె తన గురించి తప్పుగా మాట్లాడుతుందని, తన పరువును బజారుకు లాగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.  

సిద్ధిఖీ గురించి రేవతి చేసిన ఆరోపణలు ఇలా ఉన్నాయి.. సుమారు ఎనిమిదేళ్ల క్రితం సోషల్‌మీడియా ద్వారా సిద్ధిఖీ పరిచయం అయ్యాడని రేవతి సంపత్‌ తెలిపింది. సనిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తానని నమ్మించి తనను ఒక హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది.  'ప్రస్తుతం అందరూ సిద్దిఖీ మంచివాడు అంటున్నారు. ఆయన నిజస్వరూపం చాలామందికి తెలియదు. ఆయనలోని మరో కోణాన్ని నేను చూశా.  తిరువ‌నంత‌పురంలోని మ‌స్క‌ట్ హోట‌ల్‌కు నన్ను తీసుకెళ్లి అక్కడ నాపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. నాపై అత్యాచారం చేశాడు. ఆయనొక క్రిమినల్‌. ఆయన వల్ల నా కెరియర్‌ మొత్తం నాశనం అయింది.' అని తెలిపింది.

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. అందులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మాలీవుడ్‌ పరిశ్రమలో ఉండే మహిళలు కాస్టింగ్‌ కౌచ్‌ నుంచి వివక్ష వరకు  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  హేమ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో మలయాళ నటి రేవ‌తి సంప‌త్ సంచలన ఆరోపణలు చేసింది.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)