Breaking News

'జాక్‌' ఫ్లాప్‌.. సగం డబ్బు వెనక్కిచ్చేసిన హీరో!

Published on Wed, 06/04/2025 - 12:50

సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda ).. వరుస హిట్లతో స్పీడు మీదున్న ఈ హీరోకు జాక్‌ మూవీ (Jack Movie)తో సడన్‌ బ్రేక్‌ పడింది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన​ ఈ మూవీ ఏప్రిల్‌ 10, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులు ఏమాత్రం కనెక్ట్‌ కాలేకపోయారు. దీంతో జాక్‌.. బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది.

మంచి పని చేసిన సిద్ధు
దీంతో నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రాన్ని సుమారు రూ.36 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ.7 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. నిర్మాతలు తీవ్రంగా నష్టపోవడంతో సిద్ధు ఓ నిర్ణయం తీసుకున్నాడట. జాక్‌ కోసం తొమ్మిదిన్నర కోట్ల పారితోషికం తీసుకున్న సిద్ధు అందులో సగాన్ని నిర్మాతలకు వెనక్కు ఇచ్చేశాడట! దాదాపు రూ.4.75 కోట్లను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌కు తిరిగిచ్చేశాడని తెలుస్తోంది.

చూసి నేర్చుకోండి
సిద్ధు చేసిన మంచిపనికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాతల నష్టాల్ని పూడ్చేందుకు సగం రెమ్యునరేషన్‌ వదులుకున్న టిల్లు మనసు బంగారం అని కొనియాడుతున్నారు. చాలామంది హీరోలు సిద్ధును చూసి నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధు.. తెలుసుకదా సినిమా చేస్తున్నాడు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా చేస్తున్నారు. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి: కన్నప్ప హార్డ్‌ డిస్క్ మాయం.. మరోసారి స్పందించిన విష్ణు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)