Breaking News

ప్రభాస్‌ అన్న జోకర్‌ కాదు.. సక్సెస్‌ వెనక స్ట్రాంగ్‌ పిల్లర్‌: సిద్ధు

Published on Wed, 08/21/2024 - 16:25

కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆహా ఓహో అని కీర్తించారు. మరో ప్రపంచానికి వెళ్లొచ్చినట్లు ఉందన్నారు. అంత అద్భుతంగా ఉండబట్టే బాక్సాఫీస్‌ దగ్గర దాదాపు రూ.1200 కోట్లు రాబట్టింది. నెట్‌‍ఫ్లిక్స్‌లో గురువారం (ఆగస్టు 22) నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదన్నాడు బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ. 

సెటైర్లు
ప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదులే అని ఫ్యాన్స్‌ ఏదో సర్దిపెట్టుకుందామనుకునేలోపే భైరవగా ప్రభాస్‌ లుక్‌ జోకర్‌లా ఉందని సెటైర్లు వేశాడు. ఊహించినంత ఏమీ లేదని విమర్శలు గుప్పించాడు. ఈయన వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా టాలీవుడ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ సోషల్‌ మీడియా వేదికగా అర్షద్‌ వార్సీ కామెంట్లపై విరుచుకుపడ్డాడు.

అంత ఈజీ కాదు
అభిప్రాయాన్ని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కొన్ని సినిమాలను ఇష్టపడతాం. కొన్నింటిని లైట్‌ తీసుకుంటా. నటీనటుల విషయంలోనూ అంతే.. ఎవరి ఇష్టాలు వారివి. కానీ మన అభిప్రాయాలను బయటకు ఎలా చెప్తున్నామనేది ముఖ్యం. సినిమా రంగంలోకి రావడం, ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. సద్విమర్శ మంచిదే కానీ.. జోకర్‌ వంటి పదాలు వాడటం కరెక్ట్‌ కాదు.

ఒకే ఇండస్ట్రీలో ఉండి..
సినిమా రంగంలోనే ఉండి ఇలాంటి కామెంట్లు చేస్తారా? కల్కి.. భారతీయ సినిమాకే గర్వకారణంలాంటిది. నాగ్‌ అశ్విన్‌ సృష్టించిన అద్భుతం రూ.1000 కోట్ల పైనే వసూలు చేయడం మామూలు విషయం కాదు. ఇండియన్‌ సినిమాలోని పెద్ద స్టార్స్‌లో ప్రభాస్‌ అన్న ఒకరు. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. మన హిట్‌ సినిమాలకు వచ్చే కలెక్షన్స్‌ కంటే ప్రభాస్‌ అన్న ఫ్లాప్‌ సినిమాలకు వచ్చే కలెక్షన్సే ఎక్కువ! 

అలాంటి స్టార్‌డమ్‌
జయాపజయాలతో సంబంధం లేని స్టార్‌డమ్‌ తనది. కల్కి సక్సెస్‌ వెనక స్ట్రాంగ్‌ పిల్లర్‌లా నిలబడ్డాడు. ఇదే నిజం. భావప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ ఆ భావాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నామనేది ఆలోచించుకుని మాట్లాడండి. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి అని సిద్ధు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చాడు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)