మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు
Breaking News
పెద్ద సినిమాకు సెలక్ట్ అయ్యా.. తీరా హీరోగా పనికిరానని!
Published on Mon, 02/16/2026 - 15:28
ఎంతోమంది యాక్టర్స్ ఏదో ఒక సమయంలో తిరస్కరణకు గురవుతుంటారు. ఆల్రెడీ వేరేవాళ్లను సెలక్ట్ చేశాం, నీ ఫేస్‌కు ఈ పాత్ర సూటవదు... ఇలా ఏదో ఒక సాకు చెప్పి వారిని తప్పిస్తుంటారు. అలా ఓ నిర్మాత తనకూ ఓ సాకు చెప్పడంతో గుండు గీసుకున్నానంటున్నాడు బాలీవుడ్ హీరో సిద్దాంత్ చతుర్వేది.
పెద్ద సినిమాకు షార్ట్‌లిస్ట్
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఈ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. చాలామంది నన్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా రిజెక్ చేస్తూనే వచ్చారు. అయితే అందులో ఒకటి నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఒక పెద్ద సినిమాకు ఆడిషన్ ఇవ్వడానికి వెళ్లాను. నా పేరు షార్ట్‌లిస్ట్ చేయడంతో సంతోషపడ్డాను. కొన్ని వర్క్‌షాప్స్‌కి సైతం హాజరయ్యాను. నా పాత్ర కోసం నేను రెడీ అవుతూ ఉన్నాను. నేను ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలిచిన ఏడాదికే ఈ సినిమా ఆఫర్ దక్కించుకున్నాను.
రిజెక్షన్‌తో షాక్
దాంతో సినిమాల్లోకి రావడం పెద్ద కష్టమేం కాదని భావించాను. ఆ మూవీ దర్శకుడు, కాస్టింగ్ డైరెక్టర్‌కు నేను బాగా నచ్చాను. మూడు, నాలుగు నెలలు వర్క్‌షాప్‌కు హాజరయ్యాక నిర్మాత నన్ను స్క్రీన్ టెస్ట్ చేసి రిజెక్ట్ చేశాడు. నేను షాకయ్యాను. అసలేమైందని కాస్టింగ్ డైరెక్టర్‌ను అడిగాను. ఉంగరాల జుట్టు ఉంటే హీరో కాలేరు అని ఒక్క ముక్కలో సింపుల్‌గా చెప్పేశాడు. ఒకసారి జుట్టు స్ట్రయిట్ చేసుకుని ఆడిషన్‌కు రమ్మన్నారు. వాళ్లు చెప్పినట్లు చేశాక కూడా నన్ను రిజక్ట్ చేశారు.
గుండు గీసుకున్నా..
చాలా బాధపడ్డాను. నాకసలు జుట్టే వద్దని గుండు గీసుకున్నాను. మా అమ్మకు నా ఉంగరాల జుట్టు అంటే ఇష్టం. అయినా సరే కోపం, బాధతో దాన్ని తీసేశాను. ఇప్పుడీ రోజు సినిమా పోస్టర్లో అదే ఉంగరాల జుట్టుతో కనిపిస్తున్నాను. అందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. సిద్దాంత్ చతుర్వేది.. గల్లీ బాయ్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన నటించిన దో దీవానే షెహర్ మే ఫిబ్రవరి 20న విడుదలవుతోంది.
చదవండి: భార్యతో విడాకులు, జైలు జీవితం..నరకం అనుభవించానంటున్న సామ్రాట్ రెడ్డి
Tags : 1