Breaking News

పాఠాలు నేర్పినవారందరికీ ధన్యవాదాలు

Published on Fri, 07/26/2024 - 06:11

హీరోయిన్‌గా పదిహేనేళ్ల విజయవంతమైన కెరీర్‌ని పూర్తి చేసుకుంటూ, ఇంకా అగ్రశ్రేణి హీరోయిన్ల జాబితాలో ఒకరిగా రాణిస్తుండటం అంటే అంత సులభమైన విషయం కాదు. ఈ లిస్ట్‌లో చాలా తక్కువమంది హీరోయిన్లు ఉంటారు. తాజాగా శ్రుతీహాసన్‌ పేరు ఈ లిస్ట్‌లో చేరింది. తండ్రి కమల్‌హాసన్‌ నటించిన ద్విభాషా (తమిళం, హిందీ) చిత్రం ‘హే రామ్‌’ (2000)లో చైల్డ్‌ ఆర్టిస్టుగా తొలిసారి స్క్రీన్‌పై కనిపించారు శ్రుతీహాసన్‌. చైల్డ్‌ ఆర్టిస్టుగా మరో సినిమా చేయలేదు కానీ.. ‘హే రామ్‌’ రిలీజైన తొమ్మిదేళ్లకు హిందీ చిత్రం ‘లక్‌’ (2009)తో కథానాయికగా కెరీర్‌ను ఆరంభించారు శ్రుతి.

ఆ తర్వాత సూర్య ‘సెవెన్త్‌ సెన్స్‌’, ధనుష్‌ ‘త్రీ’, రామ్‌చరణ్‌ ‘ఎవడు’, అల్లు అర్జున్‌ ‘రేసుగుర్రం’ రవితేజ ‘క్రాక్‌’ .. ఇటీవల చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’,  ప్రభాస్‌ ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు శ్రుతి. నటిగా–గాయనిగా–సంగీత దర్శకురాలిగా... ఇలా మల్టీ టాలెంట్‌తో దూసుకెళుతున్నారు శ్రుతీహాసన్‌.  కథానాయికగా పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రుతీహాసన్‌ స్పందిస్తూ – ‘‘అప్పుడే పదిహేనేళ్లు పూర్తయ్యాయంటే నమ్మశక్యంగా లేదు.

నేను పెరిగిన మ్యాజికల్‌ ఇండస్ట్రీలోనే ఇంతకాలం నేను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మిగతా జీవితాన్ని కూడా ఇండస్ట్రీతోనే ముడివేస్తాను. ఇండస్ట్రీలో నాకు అందమైన పాఠాలు నేర్పినవారందరికీ ధన్యవాదాలు. అలాగే నన్ను ఆదరించిన ప్రేక్షకులు, నా అభిమానులకు థ్యాంక్స్‌. వీళ్లే లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు’’ అన్నారు. రజనీకాంత్‌ ‘కూలీ’, ప్రభాస్‌ ‘సలార్‌: శౌర్యంగాపర్వం’, అడవి శేష్‌ ‘డెకాయిట్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు శ్రుతీహాసన్‌.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)