Breaking News

స్టార్‌ హీరోతో సినిమా.. భారీ హైప్‌ తెస్తున్న శ్రుతి హాసన్

Published on Mon, 02/10/2025 - 08:51

డేరింగ్‌ హీరోయిన్‌ శ్రుతి హాసన్‌కు కోలీవుడ్‌లో మరో క్రేజీ అవకాశం వచ్చి నట్లు తాజా సమాచారం. సలార్‌ తరువాత ఈ భామ నటించిన మరో చిత్రం తెరపైకి రాలేదు. అయితే ప్రస్తుతం ఈమె ఆ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ది ఐ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రంలో శృతిహాసన్‌ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. 

తాజాగా నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 69వ చిత్రం జననాయకన్‌ లో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే నటి పూజాహెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఇందులో మలయాళ బ్యూటీ మమిత బైజూ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు బాబి డియోల్‌, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌, నటి ప్రియమణి ,ప్రకాష్‌ రాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హెచ్‌ వినోద్‌ కుమార్‌, అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎం పిక్చర్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. 

ఇప్పటికే షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రంలో శృతిహాసన్‌ నటించబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇదే గనుక నిజమైతే జననాయకన్‌ చిత్రానికి మరింత హైప్‌ వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాగా నటి శృతిహాసన్‌ విజయ్‌కి జంటగా ఇంతకుముందు పులి చిత్రంలో నటించారన్నది తెలిసిందే. కాగా తాజాగా మరోసారి విజయ్‌తో కలిసి జననాయకన్‌ చిత్రంలో నటించే విషయంపై అధికార పూర్వక ప్రకటన వెలువడ లేదన్నది గమనార్హం.
 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)