Breaking News

ఎవరితోనూ రిలేషన్‌ షిప్‌లో లేను: శ్రుతి హాసన్‌

Published on Thu, 06/25/2026 - 08:49

సంచలన నటీమణుల్లో శ్రుతి హాసన్‌ ఒకరిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అంతే కాదు చాలా బోల్డ్‌ నటి కూడా.  ప్రేమ, పెళ్లి విషయంలో చాలా స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే నటి.ప్రఖ్యాత నటుడు, సినీ వికీపీడియా కమలహాసన్‌ వారసురాలు అయిన శ్రుతి హాసన్‌ స్వతంత్ర భావాలు కలిగిన నటి. ఆ మధ్య ప్రేమించిన వ్యక్తిని తన తండ్రికి పరిచయం చేసిన గట్స్‌ ఉన్న నటి ఈ భామ.

హిందీ చిత్ర పరిశ్రమలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా సంగీత దర్శకులు,గాయని అంటూ పలు శాఖల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇటీవల ఈమె నటుడు రజనీకాంత్‌తో కలిసి కూలీ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 

తమిళంలో  విజయ్‌ సేతుపతి కి జంటగా నటించిన ట్రైన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల కథానాయకిగా బిజీగా లేకున్నా అభిమానులతో తరచూ సోషల్‌ మీడియా ఇంటరాక్టివ్‌ అవుతూ తమ భావాలను పెంచుకుంటూ వార్తల్లో ఉంటున్నారు. అలా తాజాగా అభిమానులతో ముచ్చటించారు. అందులో ఒకరు మీరు రిలేషన్‌ షిప్‌ లో ఉన్నారా అని అడగ్గా ‘‘ నేను రిలేషన్‌ షిప్‌ లో లేనని స్పష్టం చేశారు. అదేవిధంగా మీరు సినీ రంగంలో లేకుంటే ఏం చేసేవారు అన్న ప్రశ్నకు పిల్లల మనోతత్వ వైద్యురాలినన్నే దానిని పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  

Videos

TG హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట

కొడుకుపై పోలీసుల ఓవరాక్షన్.. దేవభక్తుని చక్రవర్తి తండ్రి వార్నింగ్

భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ.. కానీ ..!

నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరిన SIT బృందం

పోలీస్ బిగ్ బాస్ వెనుక చంద్రబాబు హస్తం..? సాయికృష్ణ ఫ్యామిలీతో బాబు డీల్

లోకల్ బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్

ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే!

మహిళలకు చంద్రబాబు మోసంపై YS జగన్ ఆగ్రహం

రిమాండ్ రిపోర్టులో అసలు నిజాలు.. సీఐ నాగరాజు దొరికిపోయింది ఇలాగే..!

RC17 అప్డేట్ పై సుకుమార్ షాకింగ్ కామెంట్స్.. షాక్ లో ఫాన్స్

Photos

+5

రజినీకాంత్ ధర్మాన్ మూవీ ఈవెంట్‌లో సిమ్రాన్‌ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి వేకేషన్‌లో హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు

+5

నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)

+5

షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)

+5

39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)

+5

‘సూపర్‌ సుబ్బు’ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)