Breaking News

ఆయన్ను ఎవరైనా లవ్‌ చేస్తారు: శ్రుతిహాసన్‌

Published on Mon, 03/25/2024 - 06:42

నటి శ్రుతిహాసన్‌, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌. వీరు ఇద్దరూ ఇద్దరే. ఎవరి క్రేజ్‌ వారికుంది. హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటే నాలుగు చిత్రాలతోనే మోస్ట్‌ పాపులారిటీని దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ సంపాదించుకున్నాడు. ఇక వీరికి లోకనాయకుడు కమలహాసన్‌ తోడైతే అది ఎలాంటి ప్రాజెక్ట్‌ అయినా వచ్చే క్రేజ్‌ వేరే లెవల్‌. ఇప్పుడు అదే జరిగింది. కమలహాసన్‌ రాసిన తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై రూపొందించిన ఈ పాటకు శ్రుతిహాసన్‌ బాణీలు కట్టి, పాడడంతో పాటు, అందులో దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌తో కలిసి నటించారు.

ఈ ప్రత్యేక వీడియో ఆల్బమ్‌కు 'ఇనిమేల్‌' అనే టైటిల్‌ ఖరారు చేశారు. త్వరలో విడుదల కానున్న మ్యూజికల్‌ వీడియో ఆల్బమ్‌కు సంబంధించిన చిన్న ప్రమోషన్‌ టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. దీనికి భారీ స్పందన వస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌ విషయాన్ని పక్కన పెడితే ఇందులో దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌, శ్రుతిహాసన్‌ కలిసి నటించిన సన్నిహిత సన్నివేశాలు పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ఈ పాట ప్రమోషన్‌లో భాగంగా శ్రుతిహాసన్‌, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ రాజ్‌ కమల్‌ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముచ్చటించారు.

శ్రుతిహాసన్‌ పేర్కొంటూ తాను ఆంగ్లంలో రాసి ఈ వీడియో ఆల్బమ్‌ను రూపొందించదలచినట్లు చెప్పారు. ఆ తర్వాత తన తండ్రి కమల్‌హాసన్‌ తో కలిసి చేద్దామని చెప్పగా ఆయన తన ఆంగ్లం పాటను తమిళంలో రాసినట్లు చెప్పారు. అది ఇప్పుడు దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌తో కలిసి మంచి రొమాంటిక్‌ వీడియో ఆల్బమ్‌గా మారిందని చెప్పారు. లోకేష్‌ కనకరాజ్‌ మాట్లాడుతూ ఈ వీడియో ఆల్బమ్‌ కోసం శ్రుతిహాసన్‌ తనను ఎందుకు ఎంపిక చేశారో తెలియలేదన్నారు.

అయితే ఆమె క్రియేటివిటీని చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఈ ఆల్బమ్‌లో అనూహ్యంగా శ్రుతిహాసన్‌కు లవర్‌ బాయ్‌గా ఎలా నటించ గలిగారు అన్న ప్రశ్నకు లోకేష్‌ కనకరాజ్‌ కాస్త సిగ్గుపడుతూ బదులిచ్చారు.మీకు ఎక్స్‌ లవ్‌ లాంటిది జరిగిందా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆయన బదిలించారు. దీంతో శ్రుతిహాసన్‌ కల్పించుకుని లోకేష్‌ కనకరాజ్‌ను లవ్‌ చేయని వారు ఉంటారా అంటూ, ఈయన్ని అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ప్రేమిస్తారు అంటూ పేర్కొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)