Breaking News

నాలుగేళ్లు ఒత్తిడిలోనే ఉన్నాను: శ్రుతి హాసన్‌

Published on Mon, 02/02/2026 - 07:03

నటి శ్రుతిహాసన్‌ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బహుభాషా నటిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. అంతే కాకుండా సినిమా విక్కీపీడియాగా పేర్కొనే నటుడు కమలహాసన్, సారికల వారసురాలు అనే చిరునామా కలిగిన నటి ఈ బ్యూటీ. ఇక ప్రేమ వ్యవహారంలో పలుమార్లు వార్తల్లోకెక్కిన ఈ భామ ఇటీవలే 40వ పుట్టిన రోజును జరుపుకున్నారు. శ్రుతిహసన్‌ నాయకిగా తమిళంలో నటించిన ట్రెయిన్‌ చిత్రం విడుదల కావలసి ఉంది. ప్రస్తుతం తెలుగులో ఆకాశంలో ఒక తార చిత్రంలో నటిస్తున్నారు. 

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన, గాయని, సంగీతం, రచన అంటూ పలు రంగాల్లో  కొనసాగుతున్నానని పేర్కొన్నారు. తాను చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన తల్లిదండ్రులతో పెరిగడమే ఇందుకు కారణం అన్నారు. 2018 నుంచి కొన్ని కారణాల వల్ల కొంత విరామం తీసుకున్నానని చెప్పారు. ఆ సమయంలో తానెవరు అన్నది పునః పరిశీలంచుకోవడానికి ఉపయోగించుకున్నానని చెప్పారు. 

తాను పలు ఏళ్లుగా చాలా ఒత్తిడితోనే బాధపడుతున్నట్లు చెప్పారు. ఆ ఒత్తిడి కారణంగా ఆయా పరిస్థితుల కనుగుణంగా పయనించలేకపోయానని చెప్పారు. తన విరామ కాలాన్ని లండన్‌లో గడిపానని, ఆ సమయంలో తన వంట తనే చేసుకున్నానని, తన బట్టలు తానే ఉతుక్కున్నానని, మెట్రో రైలులో పయనించానని, సంగీతం సాధన చేశానని చెప్పారు. ప్రస్తుతం ఒక కళాకారిణిగా కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు.అది ఆనందాన్ని కలిగిస్తోందని, ఇకపై చాలెంజ్‌తో కూడిన కథా పాత్రల్లో నటించడానికి ప్రాముఖ్యతనిస్తానని శ్రుతిహాసన్‌ అన్నారు.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)