Breaking News

'శృతి హాసన్ వల్లనే మా పాప ప్రాణాలతో ఉంది'

Published on Tue, 02/03/2026 - 11:55

సినీ నటి శృతి హాసన్ పలు సేవా కార్యక్రమాలతో అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధానంగా పిల్లల ఆరోగ్యం, HIV/AIDS బాధితుల సంక్షేమంతో పాటు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలను ఆదుకుంటుంది.  "Charity Closet" ద్వారా నిధులు సేకరించి, అవసరమైన వారికి అందజేస్తుంది.  శృతి హాసన్ ప్రతి సంవత్సరం తన వ్యక్తిగత దుస్తులు, ఆభరణాలు అభిమానులకు విక్రయిస్తుంది. ప్రతి సంవత్సరం తన వ్యక్తిగత దుస్తులు, ఆభరణాలు అభిమానులకు విక్రయించిన డబ్బుతో పేదలకు సాయం చేస్తుంది. తాజాగా అరుదైన జబ్బుతో బాధపడుతున్న మూడేళ్ల ఆజ్వి అనే చిన్నారి ప్రాణాలను రక్షించింది. ఇదే విషయాన్ని చెబుతు ఆ చిన్నారి తల్లిదండ్రులు ఒక పోస్ట్‌ చేశారు.

'ఆజ్వి' అరుదైన 'ఎంఎస్‌ఎమ్‌డి' (MSMD - మెండీలియన్ ససెప్టిబిలిటీ టు మైకోబాక్టీరియల్ డిసీజెస్) అనే జన్యు సంబంధిత వ్యాధితో 2023లో జన్మించింది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి) చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారు. అందుకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు. సరైన సమయంలో ఆపరేషన్‌ చేయకపోతే పాప బతకడం కష్టమని వ్యైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె బరువెక్కింది. చారటీ సాయం కోసం వెతుకుతున్న సమయంలో వారి జీవితంలో వెలుగులు నింపేందుకు శృతి హాసన్ వచ్చింది. తనకు తెలిసిన ప్రముఖ వైద్యులు ధరణి, దివ్యలను ఆ కుటుంబానికి పరిచయం చేసింది.  

ఆపై దేశంలోని అత్యుత్తమ స్పెషలిస్టుల ద్వారా పాపకు మెరుగైన వైద్యం అందేలా చూడటంతో పాటు ఆర్థిక సాయం కూడా చేసింది. గతేడాదిలో జరిగిన ఆపరేషన్‌ తర్వాత ఆ చిన్నారి పూర్తిగా కోలుకుంది. తాజాగా   శృతి హాసన్‌తో అజ్వి గడిపిన క్షణాలను తల్లిదండ్రులు పంచుకున్నారు. శృతి హాసన్‌ కేవలం ఒక స్టార్ మాత్రమే కాదని, అంతకుమించిన గొప్ప వ్యక్తి అంటూ వారు ప్రశంసించారు. ఈరోజు తమ పాప అజ్వి  బతికి ఉందంటే దానికి కారణం శృతి గారే అని కృతజ్ఞతలు తెలిపారు.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి