ఇంటి గడప దాటడానికి కూడా పోరాటం చేయాల్సి వస్తోంది: శ్రియ

Published on Sat, 05/06/2023 - 14:15

హీరోయిన్‌ శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్‌ స్కూల్‌. యామిని ఫిలిమ్స్‌ పతాకంపై పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. శర్మన్‌ జోషి, నటి లీలా సామ్సన్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళంలో కూడా అనువాద చిత్రంగా ఈనెల 12న తెరపైకి రానుంది. దీన్ని పీవీఆర్‌ పిక్చర్స్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.

ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌ గురువారం చైన్నెలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శక, నిర్మాత పాపారావు మాట్లాడుతూ ఇది ఈ తరం విద్యార్థులు చూడాల్సిన ముఖ్యమైన చిత్రమని పేర్కొన్నారు. చదువు, పరీక్షలు అంటూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని దీంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారన్నారు. అందుకు కారణం మానసిక ప్రశాంతత లేకపోవడమే అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు మానసిక ఉల్లాసం కలిగించే ఆటలు, పాటలు, సంగీతం వంటివి వారి జీవితంలో ఒక భాగం కావాలని చెప్పే చిత్రమే మ్యూజిక్‌ స్కూల్‌ అని చెప్పారు.

ఈ చిత్రం కోసం లండన్‌ వెళ్లి సంగీతం గురించి పరిశోధన చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఇళయరాజా సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుందన్నారు. శ్రియ మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు ఇంటికి వెళుతున్న భావన కలిగేదన్నారు. తాను మంచి తల్లిదండ్రులను కలిగిఉన్నానని, అందుకే అనుకున్నది చేయగలుగుతున్నానని చెప్పారు. తన బంధువుల్లో కొందరు ఇంటి నుంచి బయటికి రావడానికే చాలా పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ఈ చిత్ర కథ వినగానే అలాంటి విషయాలను అర్థం చేసుకోగలిగానన్నారు. ఇది ఈ తరానికి కావాల్సిన సినిమా అని పేర్కొన్నారు. దర్శకుడు పాపారావు చిత్రాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారని చెప్పారు.

చదవండి: మళ్లీ రెచ్చిపోయిన అనసూయ, విజయ్‌ను టార్గెట్‌ చేసిందా?

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)