Breaking News

నా అందానికి రహస్యం వ్యాయామం, ఫుడ్‌ కాదు!

Published on Tue, 12/09/2025 - 09:41

దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణించిన ఉత్తరాది భామల్లో శ్రియ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న ఈ నటిలో మంచి డాన్సర్‌ ఉన్నారు. గ్లామర్‌కు అయితే కొదవ లేదు. పాత్రలకు న్యాయం చేసే నటనా ప్రతిభ కూడా తోడుంది. వీటన్నింటికి తోడుగా అదృష్టం కలిసి రావడంతో తెలుగు, తమిళం భాషల్లో స్టార్‌ హీరోలతో జత కట్టే అవకాశాలను అందుకున్నారు. అలా దాదాపు రెండు దశాబ్దాలపాటు కథానాయికగా నటించారు. 

హీరోయిన్‌ నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా
2018లో శ్రియ తన బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కోస్కీవ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ పుట్టింది. పెళ్లి  తరువాత కొంత కాలం నటనకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల మళ్లీ నటించడం మొదలెట్టారు. అయితే కథానాయికగా కాకుండా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అదే విధంగా ప్రత్యేక పాటల్లోనూ నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అలా ఇటీవల సూర్య కథానాయకుడిగా నటించిన రెట్రో చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో నటించారు.

అదే నా అందానికి రహస్యం
తెలుగు చిత్రం మిరాయిలో ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడీమె వయసు 43 ఏళ్లు. ఈ వయసులోనూ తన అందాలను కాపాడుకుంటూ హోయలొలికిస్తున్నారు. తాజాగా తన బ్యూటీ రహస్యాన్ని ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాయామం, ఆహారపు అలవాట్లు వంటి వాటికంటే మంచిని వినడం, మంచివి చూడడం, మంచి చేయడం వంటి విషయాలతో సౌందర్యం మన నుంచి దూరం కాదు అని పేర్కొన్నారు. సాధారణంగా చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అంటారు. దీనికి నటి శ్రియ కొత్త అర్థాన్ని చెబుతూ దాన్ని అందంతో పోల్చడం విశేషం!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)