Breaking News

అలాంటి సన్నివేశంలో నటించా.. సిరి రియాక్షన్‌ ఇదే: శ్రీహాన్‌

Published on Thu, 06/26/2025 - 09:23

గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహాన్ (Shrihan), జెన్నీఫర్‌ ఇమాన్యుయేల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘వర్జిన్‌ బాయ్స్‌’. దయానంద్‌ గడ్డం దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమా జూలై 11న విడుదల కానుంది. స్మరణ్‌ సాయి సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘దం దిగ దం...’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. 

కాలేజ్‌ డేస్‌లోకి..
ఈ పాటకి ప్రణవ్‌ చాగంటి సాహిత్యం అందించగా, యాజిన్‌ నిజార్‌ పాడారు. ఈ సందర్భంగా రాజా దారపనేని మాట్లాడుతూ.. ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మా సినిమాలో వినోదంతో పాటు మంచి ప్రేమకథ ఉంది. మా చిత్రాన్ని నైజాంలో ఏషియన్‌ సునీల్‌గారు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు’’ అన్నారు. దయానంద్‌ గడ్డం మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రేక్షకులను కాలేజ్‌ డేస్‌లోకి తీసుకెళ్లి, అప్పటి ఆ రోజులను గుర్తు చేస్తుంది’’ అన్నారు. 

మూడుసార్లు మౌత్‌ వాష్‌
వర్జిన్‌ బాయ్స్‌లో నటించేందుకు బిగ్‌బాస్‌ బ్యూటీ సిరి అభ్యంతరం చెప్పలేదా? అని శ్రీహాన్‌కు ప్రశ్న ఎదురైంది. అందుకు శ్రీహాన్‌ స్పందిస్తూ.... సినిమాల విషయంలో మేము ఒకరికొకరు సపోర్ట్‌ చేసుకుంటాం. ఎన్నడూ ఎలాంటి అభ్యంతరాలు రాలేవు. కాకపోతే ఈ సినిమాలో లిప్‌లాక్‌ సీన్‌ షూటింగ్‌ అయ్యాక సిరి నాతో రెండుమూడుసార్లు మౌత్‌వాష్‌ చేయించింది అని చెప్పుకొచ్చాడు. సిరి- శ్రీహాన్‌ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే! ఇక ఈ ఈవెంట్‌లో నిర్మాత రాజా దారపునేని.. బోల్డ్‌ బ్యూటీ అరియానా గ్లోరీతో కలిసి స్టేజీపై చిందేశాడు.

 

చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్‌ చేశారో చూశారా?: సింగర్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)