Breaking News

ముద్ద సీన్‌ని తొలగిస్తారా?.. సెన్సార్‌ టీమ్‌పై నటి ఫైర్‌!

Published on Sat, 07/12/2025 - 16:44

సినిమాలో ముద్దు సీన్‌ తొలగించిన సెన్సార్‌ బోర్డ్‌పై బాలీవుడ్‌ నటి శ్రేయా ధన్వంతరి(Shreya Dhanwanthary) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల వల్ల ప్రేక్షకులు థియేటర్స్‌ రాకుండా వెళ్తారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రేక్షకులను చిన్నపిల్లల భావించి, థియేటర్‌ని అనుభూతిని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తున్నారంటూ సెన్సార్‌ బోర్డ్‌పై మండిపడింది. వివరాల్లోకి వెళితే..

డేవిడ్‌ కొరెన్స్‌వెట్‌, రెచెల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్‌ సినిమా ‘సూపర్‌ మ్యాన్‌’(Superman) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇండియన్‌ వెర్షన్‌లో 33 సెకన్ల ముద్దు సన్నివేశంతో పాటు హీరోకి సంబంధించిన కొన్ని డైలాగ్స్‌ని తొలగించారు. సెన్సార్‌ టీమ్‌ అభ్యంతరం చెప్పడం వల్లే ఆయా సన్నివేశాలు తొలగించాల్సి వచ్చిందని చిత్రబృందం పేర్కొంది. దీనిని నటి శ్రేయా ధన్వంతరి తప్పుపట్టింది. ఇదొక అర్థంపర్థం లేని చర్య అని సోషల్‌ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెల్లడించింది. 

‘సూపర్‌ మ్యాన్‌లో 33 సెకన్ల ముద్దు సీన్‌ని తొలగించడం ఏంటి? ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడాలని సెన్సార్‌ వాళ్లే చెబుతుంటారు. పైరసీని ప్రొత్సహించొద్దని అంటారు. కానీ వాళ్లు మాత్రం ఇలాంటి అర్థంపర్థం లేని పనులు చేస్తారు. వాళ్ల లక్ష్యం ఏంటో నాకు అర్థం కాదు. ఇలాంటి చిన్న చిన్న సీన్లను కూడా కట్‌ చేసి.. థియేటర్‌ అనుభూతిని దారుణంగా దెబ్బతీస్తున్నారు. మేమే డబ్బులు పెడుతున్నాం..మేమే సమయం కేటాయిస్తున్నాం కదా.. మరి మాకు నచ్చింది చూడకుండా ఆపుతారెందుకు? మేం ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్నే నిర్ణయించుకోనివ్వండి. సినిమా చూడడానికి థియేటర్‌ ఉత్తమ మార్గం. ప్రేక్షకులను చిన్న పిల్లలా భావించి.. థియేటర్స్‌ అనుభూతిని ఆస్వాదించకుండా చేస్తున్నారు’ అని సెన్సార్‌ బోర్డుపై ఫైర్‌ అయింది.

శ్రేయా ధన్వంతరి ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’, ‘స్కామ్ 1992’ వంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగులో ‘జోష్’, ‘స్నేహగీతం’ చిత్రాల్లో నటించింది. త్వరలో విడుదల కానున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్‌లో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)