Breaking News

దక్షిణాదివైపు శ్రద్ధా కపూర్‌

Published on Mon, 11/17/2025 - 07:40

బాలీవుడ్‌లో క్రేజీ కథానాయికల్లో ఒకరుగా రాణిస్తున్న నటి శ్రద్ధాకపూర్‌( Shraddha Kapoor ). అందాల ఆరబోతకు వెనుకాడని ఈ అమ్మడు కథానాయకిగా 15 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఇటీవల స్త్రీ–2 చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. 38 ఏళ్ల ఈ మహారాష్ట్ర బ్యూటీ ఆ మధ్య ప్రభాస్‌కు జంటగా సాహో చిత్రం ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించారు. చాలా మంది బాలీవుడ్‌ భామలు దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. 

అదేవిధంగా శ్రద్ధాకపూర్‌ దృష్టి దక్షిణాదిపై పడింది. ఇప్పటివరకు కోలీవుడ్‌లో నటించని ఈ బ్యూటీకి తాజాగా ఆ కోరిక నెరవేరబోతోందని సమాచారం. ఇంతకుముందు అజిత్‌ హీరోగా విడాముయర్చి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మగిళ్‌ తిరుమేణి ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో చిన్నగ్యాప్‌ తీసుకున్నారు. తాజాగా తన తర్వాత చిత్రానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. 

దీన్ని ఆయన తమిళం, హిందీ భాషల్లో రూపొందించనున్నట్లు తెలిసింది. ఇందులో విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్నారని, ఆయనకు జంటగా శ్రద్ధాకపూర్‌ను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా సంజయ్‌దత్‌ను విలన్‌ పాత్రలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)