Breaking News

అల్లు అర్జున్‌తో నో.. ఎన్టీఆర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన బాలీవుడ్‌ బ్యూటీ

Published on Sun, 02/09/2025 - 11:11

బాలీవుడ్‌ బ్యూటీ  శ్రద్ధా కపూర్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్త్రీ 2 సినిమాతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఐటమ్‌ సాంగ్‌కు గ్రీన్‌ ఇచ్చేసిందట. చిత్రపరిశ్రమలో భారీ క్రేజ్‌ ఉన్న ఆమెకు ఐటమ్‌ సాంగ్స్‌లో నటించమని ఇప్పటికే భారీ ఆఫర్స్‌ వచ్చాయి. కానీ, ఆమె సున్నితంగానే వాటికి నో చెప్పింది. అయితే.. ఎన్టీఆర్‌,  హృతిక్‌ రోషన్‌ బాలీవుడ్‌ మూవీ వార్‌2లో ఆమె స్టెప్పులు వేయనుందని తెలుస్తోంది.

‘సాహో’తో తెలుగు వారికి పరిచయమైన  శ్రద్ధా కపూర్‌కు టాలీవుడ్‌లో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె మంచి డ్యాన్సర్‌ కూడా.. అయితే,  ‘పుష్ప2’లో ప్రత్యేక పాట కోసం చిత్ర యూనిట్‌ ఆమెను సంప్రదించినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. రెమ్యునరేషన్‌ విషయంలో డీల్‌ సెట్‌ కాకపోవడంతో ఆమె నో చెప్పారని కూడ వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా ఆ ఛాన్స్‌ శ్రీలీల దక్కించుకుంది. ఇప్పుడు వార్‌2 సినిమాలో శ్రద్ధా కపూర్‌ ఒక ఐటమ్‌ సాంగ్‌లో కనిపించనుందని గట్టిగానే వినిపిస్తుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతోంది.

అల్లు అర్జున్‌ పుష్ప2  చిత్రానికి నో చెప్పిన శ్రద్ధా కపూర్..  ఎన్టీఆర్, హృతిక్‌తో కలిసి స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సినీప్రియుల్ని ఉర్రూతలూగించేలా ఆ సాంగ్‌ ఉంటుందని ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు.  త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్‌ ఉందని  శ్రద్ధ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)