Breaking News

అతనితో హీరోయిన్ డేటింగ్‌.. ఊహించని విధంగా దొరికేసింది!

Published on Mon, 03/03/2025 - 15:49

బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ పేరు ఇటీవల తెగ మార్మోగిపోతోంది. కొద్ది రోజుల క్రితమే ఓ పెళ్లిలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రాహుల్ మోడీతో కనిపించింది. వీరిద్దరు కలిసి జంటగా సన్నిహితుల వివాహా వేడుకలో పాల్గొన్నారు. దీంతో మరోసారి వీరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. గతంలోనూ అనిల్ అంబానీ పెళ్లి వేడుకలోనూ జంటగా కనిపించారు. అంతేకాదు పలు ఈవెంట్లలో శ్రద్ధా కపూర్‌ అతనితో పాటు కనిపించింది. దీంతో వీరిద్దరి డేటింగ్‌ నిజమేనని బాలీవుడ్‌లో టాక్ తరచుగా వినిపిస్తూనే ఉంది.

అయితే తాజాగా శ్రద్ధాకపూర్‌ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ముంబయిలో ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ ముద్దుగుమ్మ ఫోటోగ్రాఫర్ల చేతికి చిక్కింది. దీంతో ఆమెను తమ కెమెరాల్లో బంధిస్తుండగా తన ఫోన్‌ కూడా కనిపించింది. ఆ ఫోన్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రాహుల్ మోడీతో దిగిన ఫోటో వాల్‌పేపర్‌గా కనిపించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ ‍వీరిద్దరి డేటింగ్‌ నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే శ్రద్ధా కపూర్ చివరిసారిగా హారర్ కామెడీ ఫిల్మ్ స్త్రీ- 2లో కనిపించింది. రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో మరో మూడు సినిమాల్లో కనిపించనుంది.

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)