Breaking News

స్టార్‌ హీరోయిన్‌.. కానీ బడా హీరోలతో ఇంతవరకు జోడీ కట్టలేదు!

Published on Fri, 08/23/2024 - 11:30

కొన్ని రోజులుగా హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ పేరు మార్మోగిపోతోంది. అటు స్త్రీ ఘన విజయం ఆమెను ఉబ్బితబ్బిబ్బు చేస్తోంది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించింది. కెరీర్‌లో ఎన్నో హిట్స్‌ అందుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌ బడా స్టార్స్‌ షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌లతో మాత్రం ఇంతవరకు నటించనేలేదు. 

స్టార​ హీరోలతో నటించే ఛాన్స్‌ రాలేదా?
ఖాన్‌ త్రయంతో నటించకపోవడానికి గల కారణాన్ని శ్రద్ధ తాజాగా బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. షారూఖ్‌, ఆమిర్‌, సల్మాన్‌లతో నటించే ఛాన్స్‌ నాకు ఎప్పుడో వచ్చింది. కానీ పాత్రలో సత్తా లేకపోవడం వల్ల, అసలు ఆ రోల్‌ బాగోకపోవడం వల్ల ఇప్పటివరకు ఏదీ ఫైనలైజ్‌ కాలేదు. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు ఆఫర్‌ చేసిన పాత్ర పేలవంగా ఉంటే నేను చేయలేను.

బెస్ట్‌ అనిపించేవి సెలక్ట్‌ చేసుకుంటా
మంచి సినిమాలే చేయాలనుకుంటాను. ఉత్తమ దర్శకులతో పని చేయాలని భావిస్తాను. ఇవన్నీ చేసినప్పుడే కదా పెద్ద స్టార్స్‌తో కలిసి నటించే ఛాన్స్‌ వస్తుంది. అలాంటి ఆఫర్‌ ఇప్పుడొస్తే కచ్చితంగా ఓకే చెప్తాను అని చెప్పుకొచ్చింది. కాగా శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన స్త్రీ 2 మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటివరకు రూ.400 కోట్లు రాబట్టింది. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాజ్‌కుమార్‌ రావు, అపరశక్తి ఖురానా, అభిషేక్‌ బెనర్జీ, పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు.

చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)