Breaking News

అతనితోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ డేటింగ్‌.. రూమర్స్‌కు ఫుల్‌స్టాప్!

Published on Fri, 09/19/2025 - 15:11

బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ గతేడాది బ్లాక్‌ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. రాజ్‌కుమార్‌ రావు నటించిన స్త్రీ-2 మూవీతో సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. నాగిన్‌ మూవీతో పాటు మరో రెండు చిత్రాల్లో కనిపించనుంది. అటు షూటింగ్‌లతో బిజీగా ఉండే శ్రద్ధా కపూర్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా నెట్టింట పోస్టులు పెడుతూనే ఉంది. 

గతంలో స్క్రిప్ట్ రైటర్ రాహుల్ మోడీతో  ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో శ్రద్ధాపై డేటింగ్ రూమర్స్‌ వినిపించాయి. ముంబయిలో డిన్నర్ డేట్ తర్వాత అతనితో కలసి రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు అప్పట్లో వైరలయ్యాయి. ఆ తర్వాత చాలాసార్లు అతనితో కలిసి జంటగా కనిపించింది.అనిల్ అంబానీ పెళ్లి వేడుకలోనూ మెరిశారు. దీంతో వీరిద్దరి డేటింగ్‌ నిజమేనని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తూనే ఉంది.

తాజాగా శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. మీ కోపా తాపాలను భరించే వ్యక్తి మీ లైఫ్‌లో కనుగొనండి అంటూ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. అంతేకాకుండా తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రాహుల్ మోదీని ట్యాగ్ చేసింది. ఆ వీడియోను రాహులే తీసినట్లు తెలుస్తోంది. మీ జీవితంలో హట్‌ లాంటివి వినే వాళ్లు ఎవరై ఉంటారని హింట్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు రాహుల్‌తో డేటింగ్‌ కన్‌ఫామ్ చేసేసిందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోతో రాహుల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు పరోక్షంగానే చెప్పేసిందని పోస్ట్ చేస్తున్నారు.

గతడాది డిసెంబర్‌లోనూ రాహుల్‌తో వడా పావ్ డేట్ గురించి పోస్ట్ చేసింది. అంతకుముందు ఆమె ఫోన్ వాల్‌పేపర్‌లో అతనితో దిగిన ఫోటోతో దొరికిపోయింది. ఇవాళ పోస్ట్ చేసిన వీడియోతో వీరిద్దరి డేటింగ్ ఉన్నట్లేనని అభిమానులు భావిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే చివరిసారిగా 'స్త్రీ- 2'లో కనిపించింది. ప్రస్తుతం ఆమె నిఖిల్ ద్వివేది తెరకెక్కిస్తోన్న 'నాగిన్'లో కనిపించనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)