Breaking News

'స్త్రీ 3' ప్రాజెక్ట్‌పై శ్రద్ధా కపూర్ వ్యాఖ్యలు

Published on Sat, 10/19/2024 - 14:32

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ2  చిత్రం  బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్‌ 3 రానుంది. ఈమేరకు శ్రద్ధా కపూర్‌ పలు విషయాలను పంచుకుంది. ఆగష్టు 15న విడుదలైన స్త్రీ2 కేవలం  రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే.. సుమారు రూ. 700 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

స్త్రీ2 విజయం పట్ల శ్రద్ధా కపూర్‌  ఇలా చెప్పుకొచ్చారు. స్త్రీ సినిమా చూసిన ప్రతిసారి ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూడలేదనే ఫీల్‌ ఉంటుంది. అలాంటి సమయంలో దానికి సీక్వెల్‌ చేయాలని నన్ను కోరినప్పుడు చాలా సంతోషించాను. పార్ట్‌1 మించిన విజయాన్ని స్త్రీ2 చిత్రం ద్వారా ప్రేక్షకులు అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన  దర్శక నిర్మాతలను అభినందించాలి. ఈ చిత్రం ప్రాంచైజీలో భాగంగా మూడో పార్ట్‌ కూడా రానుంది. అయితే, అందులో మొదటి రెండు భాగాలకు మించిన  ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ఇప్పటికే మేకర్స్‌ ఆ పనులను ప్రారంభించారు.' అని ఆమె చెప్పారు.

2018లో స్త్రీ సినిమా విడుదలైంది. ఆ చిత్రం భారీ విజయం అందుకోవడంతో ఈ ఏడాది రెండో పార్ట్‌ తెరకెక్కించారు. ఇందులో భాగంగానే మూడో పార్ట్‌ను కూడా నిర్మించాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. హారర్‌ కామెడీగా వచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానులను మెప్పించాయి.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు