Breaking News

'బిగ్‌బాస్‌' హౌస్‌లో ఉండలేనంటూ కన్నీళ్లతో బయటకొచ్చిన శోభా శెట్టి

Published on Tue, 12/03/2024 - 11:26

కన్నడ బిగ్‌బాస్‌ పదకొండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి అనుకోని పరిస్థితుల్లో  హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఎలిమేనేషన్‌ ప్రక్రియలో తాను సేవ్‌ అయినప్పటికీ హౌస్‌లో ఉండలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ భరించలేకున్నానంటూ తనను బిగ్‌ బాస్‌ నుంచి బయటకు పంపాలని హౌస్ట్‌ కిచ్చా సుదీప్‌ను కోరింది. అయితే, తాను బయటకు రావడానికి గల కారణాలు తెలిపి హౌస్‌ నుంచి వచ్చేసింది.

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 7లో తనదైన గేమ్‌తో ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన శోభా శెట్టి ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి టాలీవుడ్‌ ఆడియన్స్‌ ఆశ్చర్యపోయారు. ఇక్కడి బిగ్‌బాస్‌లో శివంగిలా సత్తా చాటిన ఆమె ఎందుకు బయటకొచ్చిందో ఇలా పేర్కొంది. కేవలం రెండు వారాల పాటు మాత్రమే ఉన్న శోభ.. తన అనారోగ్య కారణాల వల్ల షో నుంచి బయటకు వచ్చేసింది. బిగ్‌బాస్‌లో గేమ్‌ ఆడాలని ఉంది కానీ ఆరోగ్యం సహకరించడం లేదని ఆమె పేర్కొంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన షోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ చేసింది.

'నా బిగ్ బాస్ ప్రయాణం ముగిసింది. ఆటపై దృష్టి పెట్టేందుకు ఆరోగ్యం సహకరించడం లేదు. ముందుకు వెళ్లాలనే సంకల్పం ఉన్నప్పటికీ, శరీరం దానిని ముందుకు సాగనివ్వడం లేదు.  నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, జీవిత బాధ్యతలతో ముందుకు సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.  నాపై చూపిన మీ ప్రేమ,  మద్దతుకు నేను ఎప్పటికీ కృతతో ఉంటాను. నేను తెలిసి లేదా తెలియక ఎవరినైనా బాధపెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నా అభిమానులకు, కలర్స్ కన్నడ టీమ్‌తో పాటు మన ప్రియమైన కిచ్చా సుదీప్ సర్‌కి ధన్యవాదాలు' అని శోభా శెట్టి పోస్ట్ చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)