Breaking News

బాలీవుడ్‌ నటుడి సోదరికి అబార్షన్‌.. దేవుడెంత పని చేశాడు!

Published on Sat, 05/13/2023 - 12:17

అమ్మతనాన్ని ఆస్వాదించాలని ఎవరికి ఉండదు. అందులోనూ గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ కడుపులోని పాపాయి ఎప్పుడు ఈ భూమి మీదకు వస్తుందా? అని వేయి కలలు కంటూ ఉంటారు. బాలీవుడ్‌ నటుడు షోయబ్‌ ఇబ్రహీం సోదరి, ఇన్‌ఫ్లూయెన్సర్‌ సబా కూడా అలానే కలలు కంది. గర్భవతి అయినప్పటి నుంచి పుట్టబోయే బిడ్డపై గంపెడాశలు పెట్టుకుది. కానీ ఆమె కలలు కల్లలయ్యాయి. కడుపులోనే బిడ్డ మరణించింది. దీంతో ఆమెకు అబార్షన్‌ చేయక తప్పలేదు.

ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో పంచుకున్న సబా-సన్నీ దంపతులు తాజాగా మిస్‌క్యారేజ్‌ అయిన విషయాన్ని వెల్లడించారు. ముందు నుంచీ బిడ్డ గుండె సరిగా కొట్టుకోవడం లేదని చెప్పిన వైద్యులు ఆమెకు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవమని చెప్పారు. తాజాగా స్కానింగ్‌కు వెళ్లినప్పుడు పరీక్షించగా శిశువు గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని తెలిపారు. ఆమెకు అబార్షన్‌ చేశారు.

దీనిపై సబా మాట్లాడుతూ.. 'ఈ బాధను ఎలా దిగమింగుకోవాలో తెలియడం లేదు. సన్నీ మనసుకెంత కష్టంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. ఆ భగవంతుడు ఇలా జరగాలని ఉందని రాసిపెట్టాడు. దానికి మేమేం చేయగలం? కానీ అబార్షన్‌ చేయడానికి ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లినప్పుడు చాలా భయమేసింది' అని చెప్పుకొచ్చింది. అటు సన్నీ మాట్లాడుతూ.. 'ఒకవేళ నేను ఆపరేషన్‌ అయ్యాక తిరిగి రాకపోతే ఏం చేస్తావు? అని సబా అడిగింది. ఆ మాట విని చాలా బాధేసింది. తను మానసికంగా చాలా భయపడింది' అని పేర్కొన్నాడు. కాగా సబా- సన్నీ గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు.

చదవండి: రాజకీయాల్లోకి రీఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేశ్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)