Breaking News

ఆ సినిమాలో చేస్తే అవకాశాలు రావన్నారు: శివాత్మిక రాజశేఖర్

Published on Sat, 04/01/2023 - 21:49

జీవిత రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి శివాత్మిక. 'దొరసాని' సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక. ఆ తరువాత కూడా తనకి తగిన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'రంగమార్తాండ'లో శివాత్మిక చేసిన పాత్రతో మరింత ఫేమ్ వచ్చింది. 

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ చూసిన సినీ ప్రేక్షకులు శివాత్మిక పాత్రను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించింది. తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర  విషయాలను పంచుకున్నారామె.

శివాత్మిక మాట్లాడుతూ.. ‘రంగమార్తాండలో నాది మెయిన్ రోల్ కాదు. అందుకే సినిమాకు అంగీకరించినప్పుడే నాకు చాలా మంది వద్దని చెప్పారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చెయ్యొద్దని సలహా ఇచ్చారు. అలాంటి సినిమాలు ఎవరూ చూడరని చెప్పారు. చాలా భయపడతారు. కానీ ఇప్పుడు ఆ సినిమానే మంచి హిట్ అయి పేరు తీసుకొచ్చింది. కానీ దొరసాని సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నా. ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నా. కానీ ఆ తరువాత గ్యాప్ వచ్చింది. దీంతో నేను అనుకున్నంత ఈజీ కాదన్న విషయం అప్పుడర్థమైంది.' అంటూ చెప్పుకొచ్చింది. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)