‘45’ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు : శివరాజ్‌ కుమార్‌

Published on Sun, 12/28/2025 - 08:48

‘‘అర్జున్‌ జన్య చెప్పిన ‘45’ కథ నచ్చడంతో ‘మీరే డైరెక్ట్‌ చేయండి’ అని చెప్పాను. తనకు ఇచ్చిన అవకాశానికి పూర్తిగా న్యాయం చేశారు అర్జున్‌. ఈ మూవీ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు... గౌరవిస్తారు. బతికినన్ని రోజులు హ్యాపీగా  జీవించాలని మా చిత్రం చెబుతుంది’’ అని శివ రాజ్‌కుమార్‌ తెలిపారు. 

సంగీత దర్శకుడు అర్జున్‌ జన్య దర్శకత్వంలో శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్‌ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘45’. ఉమా రమేశ్‌ రెడ్డి, ఎం. రమేశ్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా జనవరి 1న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ ఎవ్వరూ ఇవ్వని పాత్రను నాకు ఈ సినిమాలో అర్జున్‌ ఇచ్చారు. స్క్రీన్‌ప్లేని చాలా గ్రిప్పింగ్‌గా రాశారు అర్జున్‌. మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ‘45’ని కూడా సపోర్ట్‌ చేయాలి’’ అని చెప్పారు.

 ‘‘45’లో ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు’’ అన్నారు అర్జున్‌ జన్య ‘‘గరుడ పురాణం గురించి చాలా గొప్పగా చెప్పే చిత్రమిది’’ అని రమేశ్‌ రెడ్డి తెలిపారు. ‘‘మంచి సందేశాన్ని ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు మైత్రీ శశి.

Videos

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

Photos

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)