Breaking News

ఇంటికి నేనే దరిద్రం.. నా వల్లే మా నాన్న ఐసీయూలో..: శివానీ ఎమోషనల్‌

Published on Sun, 11/26/2023 - 17:03

టాలీవుడ్‌ స్టార్‌ జంట జీవిత- రాజశేఖర్‌ల కూతుర్లిద్దరూ వెండితెరపై హీరోయిన్లుగా రాణిస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్టులను ఎంచుకుంటూ ఆచితూచి ముందడుగు వేస్తున్నారు. శివానీ రాజశేఖర్‌ ఈ మధ్యే కోటబొమ్మాళి పీఎస్‌ సినిమాతో హిట్‌ అందుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్‌ అయింది. 'www సినిమా షూటింగ్‌లో నాకు కరోనా సోకింది. అంతలోనే ఇంట్లో అందరికీ వ్యాపించింది. నేను త్వరగానే కోలుకున్నాను. అమ్మ, చెల్లికి కూడా కొద్ది రోజుల్లోనే తగ్గిపోయింది.

నా వల్ల కుటుంబానికి గండం!
కానీ నాన్నకు మాత్రం సీరియస్‌ అయింది. వెంటిలేటర్‌ వరకు వెళ్లి వచ్చాడు. నాన్నకు నా వల్ల కరోనా రావడంతో నా జాతకం బాలేదని, నా వల్ల కుటుంబానికి గండం ఉందని చాలామంది ఏవేవో మాటలు చెప్పారు. మొదట నేను పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నాన్న వెంటిలేటర్‌పైకి వెళ్లాడో అప్పుడు చాలా బాధపడ్డాను. నా వల్లే ఇదంతా జరుగుతుందేమో.. ఇంటికి నేనే దరిద్రం ఏమో.. నా జాతకంలో ఏదైనా దోషం ఉందేమో, నా వల్ల మా నాన్నకు ఏమవుతుందోనని భయపోడిపోయాను.

నాకు అనారోగ్య సమస్య
అప్పుడు నాకు ఓ అనారోగ్య సమస్య ఉండేది. దానివల్ల ఉన్నట్లుండి గుండెదడ ఎక్కువయ్యేది. గుండెచప్పుడు సడన్‌గా 170-200 వరకు వెళ్లేది. నాన్న డాక్టర్‌ కాబట్టి గుండె దడ మొదలవగానే మందులు ఇచ్చేవాడు. అది నెలకోసారి వచ్చిపోతూ ఉండేది. నాన్నకు కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ రెండుమూడుసార్లు గుండెదడ వచ్చేది. నాన్న పక్కనే ఐసీయూ బెడ్‌లో నిద్రపోయేదాన్ని. ఒకరోజు అతడి పరిస్థితి మరీ సీరియస్‌ అయింది.

ప్రార్థనలే బతికించాయి
అందరూ ప్రార్థించండి, ఇక అదే మిగిలింది అని పేపర్‌ మీద రాశాడు. నీకేమైనా అయితే నేను కూడా చనిపోతాను.. నువ్వు పోరాడు అని చెప్పాను. ఆయన్ని అభిమానుల ప్రార్థనలే బతికించాయి' అని చెప్పుకొచ్చింది. ఉప్పెన సినిమాను చేజార్చుకోవడంపై స్పందిస్తూ.. 'ఉప్పెన సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చింది. కానీ ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో చేయనని చెప్పాను. కానీ నాకు చెప్పిన కథకు, సినిమా ఫైనల్‌ అవుట్‌పుట్‌కు చాలా తేడా ఉంది' అని తెలిపింది శివానీ రాజశేఖర్‌.

చదవండి: తెలుగులో హీరోయిన్‌గా, పనిమనిషిగా నటించిన బ్యూటీ.. కొట్టి మరీ ఏడిపించారు.. గుర్తుపట్టారా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)