Breaking News

అమ్మతోడు.. జైలర్‌లో ఏం చేశానో నాకే తెలీదు: శివరాజ్‌కుమార్‌

Published on Wed, 04/16/2025 - 13:31

రజనీకాంత్‌ హీరోగా నటించిన జైలర్‌ మూవీ (Jailer Movie) వచ్చి రెండేళ్లవుతోంది. అప్పట్లో జైలర్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు షేక్‌ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించిన శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, జాకీ ష్రాఫ్‌ల పర్ఫామెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌ తెరకెక్కుతోంది. జైలర్‌ 2లో తన ఎంట్రీ ఉందని కన్ఫామ్‌ చేసేశాడు శివరాజ్‌కుమార్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా కన్నడ చిత్రం 45. 

వెంటనే ఒప్పేసుకున్నా..
ఈ సినిమా ఈవెంట్‌లో శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. జైలర్‌ సినిమాను రజనీకాంత్‌ కోసమే చేశాను. చిన్నప్పటినుంచి ఆయన్ను చూస్తూ ఉన్నాను. తను నాకు నా కుటుంబంలోని వ్యక్తిలాగే అనిపిస్తాడు. రజనీకాంత్‌ సినిమా అనగానే క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాను.  ఆయన నాకు తండ్రిలాంటివాడు. అందుకే ఎంత చిన్న పాత్రయినా సరే రెడీ అని చెప్పాను. కథేంటని కూడా అడగలేదు. వాళ్లే పిలిచి మరీ కథంతా చెప్పారు. ఏదేమైనా సరే, నేను యాక్ట్‌ చేస్తానని భరోసా ఇచ్చాను.

అమ్మతోడు.. ఏం చేశానో..
కానీ నా లుక్‌, రోల్‌ అంత బాగా ఎలా వర్కవుట్‌ అయిందనేది నాకిప్పటికీ అర్థం కాదు. సినిమా రిలీజయ్యాక దేశవిదేశాల నుంచి నా ఫ్రెండ్స్‌ ఫోన్‌ చేసి అదిరిపోయిందని పొగిడారు. నేను చేసిందే రెండు సీన్లు కదరా అంటుంటే కూడా సూపర్‌ అని మెచ్చుకున్నారు. అమ్మతోడు.. నేనంత గొప్పగా ఏం చేశానో నాకిప్పటికీ అర్థం కాదు. సిగరెట్‌ పట్టుకుని నడిచావ్‌, టిష్యూ డబ్బా తన్నావు.. అంతకుమించి ఏం చేశావ్‌? అని నా భార్య ఇప్పటికీ దెప్పి పొడుస్తుంది.

బహుశా అదే కారణమేమో!
బహుశా గుడ్‌ లుక్స్‌ వల్ల కావొచ్చు. ఈ విషయంలో డైరెక్టర్‌ నెల్సన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌, నన్ను బాగా చూపించిన కెమెరామెన్‌కు థాంక్స్‌ చెప్తున్నాను. జైలర్‌ 2లో కూడా నేను కనిపించబోతున్నాను అని పేర్కొన్నాడు. జైలర్‌ 2లో నందమూరి బాలకృష్ణ భాగమయ్యారన్న ప్రచారం గురించి తనకేమీ తెలియదన్నాడు.

చదవండి: కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్‌ తీసుకుందని ట్రోలింగ్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)