రజనీకాంత్‌ భార్యగా ఛాన్స్‌ ఇప్పిస్తాం.. కాకపోతే ఒక కండీషన్‌!

Published on Fri, 03/14/2025 - 14:17

రజనీకాంత్‌ సినిమాలో ఛాన్స్‌ ఇస్తాం.. అనగానే ఎవరైనా ఏం చేస్తారు? ఎగిరిగంతేస్తారు. అందులోనూ రజనీకి భార్యగా అనేసరికి లోలోపలే సంతోషపడిపోయింది మలయాళ నటి శినీ సారా. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. అదేంటి? ఆల్‌రెడీ రజనీకి భార్యగా రమ్యకృష్ణ నటిస్తోందిగా అని స్ఫురించింది. కేవలం తన దగ్గర డబ్బు గుంజేందుకే ఇలాంటి కాకమ్మ కహానీలు చెప్పాడని అర్థం కావడంతో నిరాశగా నిట్టూర్పు విడ్చింది.

ఆర్టిస్ట్‌ కార్డ్‌ ఉందా?
ఈ మోసం గురించి శినీ సారా మాట్లాడుతూ.. కాస్టింగ్‌ ఏజెన్సీ ద్వారా అందిన మీ అప్లికేషన్‌ను సెలక్ట్‌ చేశాం అంటూ వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ వచ్చింది. జైలర్‌ 2 మూవీలో రజనీకాంత్‌ భార్య కోసం నటుల్ని వెతుకుతున్నట్లుగా ఉంది. తర్వాత వారు ఫోన్‌ చేసి ఆర్టిస్ట్‌ కార్డు ఉందా? అని అడిగారు. మలయాళంలో అయితే అలాంటి కార్డులు ఏవీ లేవన్నాను. సరే దానికి అవసరమైన ఏర్పాట్లు తామే చూసుకుంటామన్నారు. సురేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి మీకు ఫోన్‌లో సంప్రదిస్తాడని చెప్పారు.

జైలర్‌ 2లో రజనీ భార్యగా ఛాన్స్‌
రెండు రోజుల తర్వాత ఆ సురేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేశాడు. చీర కట్టుకుని వీడియో కాల్‌లో ఇంటర్వ్యూకు హాజరవమన్నారు. జైలర్‌ 2లో రజనీకాంత్‌ భార్యగా నన్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. నాకసలు అర్థం కాలేదు. అప్పటికే జైలర్‌ 2లో రజనీ భార్యగా రమ్య కృష్ణ నటిస్తోంది. ఇదే విషయం చెప్పాను. దాంతో అతడు మరో సినిమా కోసం సెలక్ట్‌ చేశామన్నాడు. అయితే ఆర్టిస్ట్‌ కార్డ్‌ తప్పనిసరిగా అవసరం ఉంటుందని.. దానికోసం అప్లై చేయాల్సి ఉంటుందన్నాడు. 

డబ్బు అడగడంతో అనుమానం మొదలు
ఇందుకోసం ఓ అప్లికేషన్‌ కూడా పంపిస్తున్నానని, అందులో అన్ని వివరాలు పొందుపరచమని చెప్పాడు. ఇదంతా నిజమేననుకుని ఆధార్‌ కార్డ్‌ వివరాలు, నా ఫోటో షేర్‌ చేశాను. వెంటనే అతడు రూ.12,500 డబ్బు కట్టమన్నాడు. అందుకోసం నాకు రెండు రోజుల గడువు ఇవ్వమని అడిగాను. దానికతడు.. వీలైనంత త్వరగా కట్టేయాలని, ఇప్పుడే డబ్బు పే చేయమన్నాడు. అప్పుడు నాకు అనుమానం మొదలైంది. 

తస్మాత్‌ జాగ్రత్త
కోలీవుడ్‌లో నాకు తెలిసిన స్నేహితులు మాల పార్వతి, లిజొమోల్‌కు ఫోన్‌ చేశాను. కానీ వారు నా కాల్‌ లిఫ్ట్‌ చేయలేదు. అప్పుడు మరొకరికి కాల్‌ చేయగా.. ఆర్టిస్ట్‌ కార్డ్‌ లేకపోయినా తమిళ ఇండస్ట్రీలో పనిచేయొచ్చని తెలిపారు. దీంతో నాకు జరిగింది స్కామ్‌ అని తెలిసిపోయింది. ఇలాంటివారిని నమ్మి చాలా మంది డబ్బులు మోసపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది.

చదవండి: ప్రేయసి కోసం ముందు జాగ్రత్తలు తీసుకున్న 60 ఏళ్ల హీరో.. అప్పుడే..!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)