Breaking News

మీమర్స్‌కి ఫుల్ స్టఫ్ ఇస్తున్న 'దసరా' విలన్

Published on Fri, 06/30/2023 - 17:12

మార్కెట్‌లోకి కొత్త సరుకొచ్చింది! అవును మీరు కరెక్టేగానే విన్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ట్రెండ్ అవుతుంటారు. ముఖ్యంగా తెలుగు యాక్టర్స్ ఏదో ఓ పనిచేస్తారు. దానికి సంబంధించిన వీడియో బయటకొస్తుంది. మీమర్స్ అలెర్ట్ అయిపోతారు. ఫన్నీగానే తెగ ట్రోల్ చేస్తారు. అలా ఇప్పుడు వాళ్లంతా 'దసరా' విలన్ మీద పడ్డారు. అతడివి పాత వీడియోలన్నీ బయటకు తీసి తెగ ఆడేసుకుంటున్నారు. ఇంతకీ ఈ నటుడు ఏం చేశాడు?

(ఇదీ చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?)

ఎవరితడు.. బ్యాక్‌గ్రౌండ్?
షైన్ టామ్ చాకో.. కేరళలోని త్రిసూర్‌లో పుట్టి పెరిగాడు. కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాడు. కమల్ అనే దర్శకుడి దగ్గర దాదాపు పదేళ్లపాటు అంటే 2002-12 మధ్య పనిచేశాడు. ఇదే డైరెక్టర్ తీసిన 'గడ్డమ్మ' మూవీతో నటుడిగా మారాడు. యాక్టర్ గా రెండు మూడేళ్లపాటు చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఓ వైపు విలన్ గా చేస్తూ, మరోవైపు లీడ్ రోల్ లో నటిస్తూ తనకంటా ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 

తెలుగులో కూడా
లాక్‌డౌన్‌లో తెలుగు ప్రేక్షకులు ఓటీటీల్లో మలయాళ సినిమాలు చాలా చూశారు. అలా షైన్ టామ్ చాకో మనవాళ‍్లకు పరిచయమే. గతేడాది విడుదలైన విజయ్ 'బీస్ట్'తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'దసరా'తో తెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇతడు విలన్ గా చేసిన 'రంగబలి' విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఎన్టీఆర్ 'దేవర'లోనూ కీలకపాత్రలో నటిస్తున్నట్లు ఇతడే బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' ఓటీటీ రిలీజ్.. అనుకున‍్న టైమ్ కంటే ముందే?)

విచిత్రమైన ప్రవర్తన!
నటుడిగా షైన్ టాక్ చాకోని వంకపెట్టడానికి ఏం లేదు. విలన్‌గా అదరగొట్టేస్తున్నాడు. సినిమాల్లో ఇతడి పాత్రలో సీరియస్ గా భయపెట్టేలా ఉండోచ్చేమో కానీ బయటమాత్రం ఇతడు ఫుల్ కామెడీ చేస్తున్నాడు. ఈ మధ్య 'రంగబలి' ప్రమోషన్స్ లో లేడీ యాంకర్ షర్ట్ బాగుందని చెప్పగనే.. అక్కడే విప్పి ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ వీడియో దెబ్బకు గతంలో షైన్ ఫన్నీగా ప్రవర్తించిన వీడియోలన్నీ బయటకొస్తున్నాయి.

ఆ యాంకర్‌తో ఎక్కువగా
తెలుగులో ఒక్క వీడియోతో షైన్ టామ్ చాకో వైరల్ అయ్యాడు గానీ మలయాళంలో షైన్- లేడీ యాంకర్ పార్వతి బాబుది హిట్ కాంబినేషన్. వీళ్లిద‍్దరూ కలిసి వీడియో చేశారంటే ఫుల్ ఎంటర్ టైన్‌మెంట్ గ్యారంటీ. ఇప్పుడు తెలుగులోనూ అలానే ఫన్ జనరేట్ చేస్తూ మీమర్స్‌కి ఫుల్ స్టప్ ఇస్తున్నాడు. ఇతడిని చూస‍్తున్న నెటిజన్స్.. 'ఎవర్రా బాబు నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్' అని కామెంట్స్ చేస్తున్నారు. దిగువన అతడి వీడియోలు ఉన్నాయి. మీరు ఓసారి చూసేయండి.

(ఇదీ చదవండి: సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)