Breaking News

హీరోయిన్‌తో అసభ్యకర ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన దసరా విలన్‌

Published on Wed, 07/09/2025 - 08:43

‘దసరా’ విలన్‌ షైన్‌ టామ్‌ చాకో(Shine Tom Chacko ) ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. డ్రగ్స్‌ ఆరోపణలు, కొన్నాళ్లకే  రోడ్డు ప్రమాదం..ఆ ప్రమాదంలో తండ్రి మరణించడం.. ఇవన్నీ చాకోని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయి. అందుకే కొన్నాళ్లుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. గతంలో చేసిన తప్ప్పులను సరిదిద్దుకుంటున్నారు. అందులో భాగంగా గతంలో తన ప్రవర్తన వల్ల ఇబ్బందిపడ్డ నటి విన్సీసోనీ అలోషియన్‌(Vincy Aloshious)కి తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. కావాలని అలా చేయలేదని.. ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలంటూ మీడియా ముందే ఆమెను కోరారు. చాకో చెప్పిన సారీని విన్సీ అంగీకరించడంతో వివాదానికి ఎండ్‌ కార్డు పడింది.

సూత్రధారి సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆ మధ్య విన్సీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మలయాళ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా ఇదే సినిమా ప్రచారం కోసం వచ్చిన చాకో.. అందరి ముందే విన్సీకి క్షమాపణలు చెప్పాడు. 

‘నేను కావాలని మీతో ఇబ్బందికరంగా ప్రవర్తించలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను సరదాగా చెప్పానంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు. నా ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడినందుకు క్షమించాలి’ అని  కోరగా.. పక్కనే ఉన్న విన్సీ మైక్‌ తీసుకొని ‘ఆ సమయంలో ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ఆయన నుంచి ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. నేను స్పందించిన తీరు ఆయన కుటుంబాన్ని కూడా ఎంతో బాధించింది. ఇప్పుడు ఆయనలో మార్పు కనిపిస్తుంది. తప్పు తెలుసుకున్నాడు. ఆయనపై గౌరవం మరింత పెరిగింది’ అని పేర్కొంది. 

విన్సీ క్షమించడంతో చాకోకు ఒక పెద్ద రిలీఫ్‌ లభించినట్లు అయింది. ఇప్పటికే డ్రగ్స్‌ కేసుతో ఇబ్బంది పడుతున్న చాకో.. సారీ చెప్పి మంచి పనే చేశాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ సినిమా షూటింగ్‌లో అయితే వివాదం చెలరేగిందో.. అదే సినిమా ఈవెంట్‌లో దాన్ని పరిష్కరించుకొని ఒక సమస్యను తగ్గించుకున్నాడు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)