Breaking News

నేనెప్పుడూ నీవైపే.. ఒట్టేసి చెప్తున్నా: శిల్ప శిరోద్కర్‌

Published on Mon, 12/15/2025 - 14:46

శిరోద్కర్‌ సిస్టర్స్‌ ఇండస్ట్రీలో తామేంటో రుజువు చేసుకున్నారు. అక్క నమ్రత తెలుగులో హీరోయిన్‌గా రాణిస్తే.. చెల్లి శిల్ప బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా దుమ్ము లేపింది. కాకపోతే ఇద్దరూ పెళ్లయ్యాక సినిమాలను పట్టించుకోవడం మానేశారు. శిల్ప రీఎంట్రీకి సిగ్నల్‌ ఇస్తూ గతేడాది హిందీ బిగ్‌బాస్‌ 18వ సీజన్‌లో పాల్గొంది. ఈ ఏడాది 'జటాధర' సినిమాతో పలకరించింది.

పర్ఫెక్ట్‌ బర్త్‌డే డిన్నర్‌
ఇదిలా ఉంటే శిల్ప- రంజిత్‌ దంపతుల కూతురు అనౌష్క ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను నటి ఆలస్యంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. "నా పర్ఫెక్ట్‌ కూతురికి పర్ఫెక్ట్‌ బర్త్‌డే డిన్నర్‌.. ఫ్యామిలీ, ఫుడ్‌, అంతులేని సంతోషం.." అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఫోటోల్లో అనౌష్క పెద్దమ్మాయిగా కనిపిస్తోంది. అందంలో తల్లికే కాంపిటీషన్‌ ఇచ్చేలా ఉంది. ఈ ఫోటోల్లో శిల్ప భర్త రంజిత్‌ కూడా ఉన్నాడు.

ఎంత ఎదిగిపోయావో..
అనౌష్క పుట్టినరోజునాడు తను చిన్నప్పుడు దేశీ గర్ల్‌ పాటకు స్టెప్పేసిన ఓ డ్యాన్స్‌ వీడియోను సైతం షేర్‌ చేసింది. నా గారాలపట్టి అప్పుడే ఎంత పెద్దదైపోయింది. కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. నువ్వు ఎన్ని బర్త్‌డేలు జరుపుకున్నా సరే నాకు మాత్రం ఎప్పుడూ చిన్న పాపవే! ఒక ధృడమైన అమ్మాయిగా నువ్వు ఎదిగిన తీరు చూస్తుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా ప్రపంచం, సంతోషం అన్నీ నువ్వే.. నమ్ముతావో, లేదో కానీ.. నువ్వు నా బెస్ట్‌ ఫ్రెండ్‌వి కూడా! నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా బంగారం. ఎల్లప్పుడూ నేను నీకు అండగా నిలబడతానని మాటిస్తున్నాను అని రాసుకొచ్చింది.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)