Breaking News

రెస్టారెంట్‌ మూసేసిన స్టార్‌ హీరోయిన్‌

Published on Wed, 09/03/2025 - 11:36

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి(Shilpa Shetty) సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబై బాంద్రాలో ఉన్న తన లగ్జరీ రెస్టారెంట్‌ ‘బాస్టియన్‌’ను (Bastian) మూసివేయనున్నట్లు ప్రకటించింది. గత కొద్దిరోజుల క్రితమే శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రా  రూ.60 కోట్ల మేర మోసం చేశారంటూ ఒక వ్యాపారావేత​ ఆరోపణలు చేశాడు. ఆపై వారిమీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం, ఈ కేసు దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం (EOW)కి అప్పగించారు.

"ముంబైలోని అత్యంత పేరుగాంచిన మా రెస్టారెంట్‌ బాస్టియన్‌ను ఈ గురువారం మూసివేస్తున్నాం. ఒక శకం ముగిసింది. ఎన్నో లెక్కలేనన్ని జ్ఞాపకాలు, మరపురాని క్షణాలను ఇచ్చింది. ఎందరికో సంతోషాన్ని పంచిన ఈ వేదిక ఇకపై మూతపడనుంది. వీడ్కోలు పలికేందుకు గురువారం ఒక వేడుక నిర్వహిస్తున్నాం. వ్యాపార భాగస్వాములతో పాటు కొందరు సన్నిహితులు కూడా హాజరుకానున్నారు. త్వరలో సరికొత్త అనుభవాలతో మీ ముందుకు వస్తాం.' అని ఆమె తెలిపారు. 

ముంబైలో ఆరుచోట్ల బాస్టియన్‌ పేరుతో వారికి బ్రాంచ్‌లు ఉన్నాయి. 2016లో ముంబై బాంద్రాలో ప్రారంభమైన మొదటి బ్రాంచ్‌ను వారు మూసివేస్తున్నారు. కారణం ఏంటి అనేది వారు చెప్పలేదు. కానీ, మూసివేతకు ప్రధాన కారణం రూ.60 కోట్ల మోసం కేసు అని తెలుస్తోంది.అయితే, శిల్పా శెట్టి తన సినిమా కెరీర్‌తో పాటు ఫుడ్, హాస్పిటాలిటీ రంగంలో కూడా తన మార్క్ వేసింది.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)