Breaking News

చెప్పులేసుకుని జెండా ఎగరేసిన హీరోయిన్‌.. వీడియో వైరల్‌

Published on Wed, 08/16/2023 - 10:53

పంద్రాగస్టు రోజున స్కూలు, కాలేజీలు, కార్యాలయాలే కాకుండా ప్రతి ఇంట జెండా ఎగరేశారు.  హర్‌ ఘర్‌ తిరంగా పేరిట చాలామంది ఇళ్లల్లో జెండా రెపరెపలాడింది. బాలీవుడ్‌ బ్యూటీ శిల్పా శెట్టి కూడా ఈ ట్రెండ్‌లో పాలు పంచుకుంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైలోని జుహులో తన ఇంటి ముందు జెండాను ఎగరేసింది. 

ఈ క్రమంలో ఆమె చెప్పులు ధరించే జాతీయ పతాకాన్ని ఎగరవేసి జెండావందనం చేసింది. ఈ వీడియోను శిల్పా శెట్టి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. చెప్పులేసుకుని ఫ్లాగ్‌ ఎగరేయడమేంటి? కాస్తైనా బుద్ధుండక్కర్లా? అని మండిపడ్డారు. నీ చెప్పులు పక్కన విడిచి ఆ పని చేస్తే బాగుండేది అని సెటైర్లు వేశారు. అయితే కొందరు మాత్రం చెప్పులు వేసుకుని జెండా ఎగరేయడంలో తప్పే లేదని హీరోయిన్‌ను వెనకేసుకొచ్చారు.

ఈ ట్రోలింగ్‌ చూసిన శిల్పా.. త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై తనకు పూర్తి అవగాహన ఉందని కౌంటరిచ్చింది.  చెప్పులేసుకోకూడదన్న నియమం ఫ్లాగ్‌ కోడ్‌లో ఎక్కడా లేదంటూ గూగుల్‌లో ఓ ఆర్టికల్‌ను వెతికి మరీ షేర్‌ చేసింది. 'ఇలా పనిగట్టుకుని విమర్శలు చేసేవాళ్లను నేనసలు పట్టించుకోను. మీ అజ్ఞానాన్ని ప్రచారం చేయడం, నిత్యం విమర్శించడమే పనిగా పెట్టుకోవడం  మెచ్చుకోదగిన విషయం కాదు. ముందు మీరు వాస్తవాలు తెలుసుకుని అప్పుడు మాట్లాడండి' అని ఘాటుగా బదులిచ్చింది.

చదవండి: రెండేళ్లకే విడాకులు.. హీరోయిన్‌ జీవితంలో ఇంత విషాదం దాగి ఉందా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)