Breaking News

రెస్టారెంట్‌ మూసివేత.. అసలు విషయం చెప్పిన శిల్పా శెట్టి

Published on Thu, 09/04/2025 - 08:04

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి(Shilpa Shetty) తన రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అందుకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు. తనకు ఎంత కష్టం వచ్చిందో అంటూ కామెంట్లు కూడా చేశారు. ముంబైలోని బాంద్రాలో సుమారు పదేళ్ల క్రితం తొలి రెస్టారెంట్‌ 'బాస్టియన్‌'ను ఆమె ప్రారంభించింది. మొదటి బ్రాంచ్‌నే క్లోజ్‌ చేస్తున్నట్లు చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే, తాజాగా ఆమె ఒక వీడియోతో రియాక్ట్‌ అయింది.

‘బాస్టియన్‌’ రెస్టారెంట్‌ను మూసేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత వేల ఫోన్స్‌ వస్తున్నాయని నటి శిల్పా శెట్టి చెప్పింది. అయితే, దానిని పూర్తిగా మూసివేయడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. బాంద్రాలోని బాస్టియన్‌ రెస్టారెంట్‌ మాకు రూట్‌ లాంటింది. ఒక చెట్టుకు ఫలాలు ఎలా లభిస్తాయో.. ఇప్పుడు బాస్టియన్‌ కూడా మాకు కొత్త ఫలాన్ని అందించనుంది. ఇదే ప్రదేశంలో 'అమ్మకై' (AMMAKAI) పేరుతో దక్షిణ భారతదేశ వంటకాలు అందించనున్నాం. నా మూలాలకు సంబంధించిన మంగళూరు వంటకాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. మీకు ఇష్టమైన 'బాస్టియన్' కూడా ఉంటుంది. 

అయితే, బాస్టియన్ బీచ్ క్లబ్ పేరుతో జుహు ప్రాంతంలో ప్రారంభించబోతున్నాం. కాబట్టి బాస్టియన్‌ క్లోజ్‌ చేశాం అనే ప్రచారంలో నిజం లేదు. నా సోదరుడు, భాగస్వామి రంజీత్ బింద్రా వీటికి CEOగా ఉన్నారు. ఇవన్నీ అతని ఆలోచన నుంచి వచ్చిన మంచి నిర్ణయాలు. బాంద్రాలో దక్షిణ భారతదేశ వంటకాలు అక్టోబర్‌ నెలలోనే ప్రారంభమవుతాయి.' అని ఆమె క్లారిటీ ఇచ్చింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)