Breaking News

గుండె పోటు కాదు.. 42 ఏళ్ల నటి మృతిపై అనుమానాలు!

Published on Sat, 06/28/2025 - 12:23

‘కాంటా లగా’ఫేం, బాలీవుడ్‌ నటి షెఫాలీ జరివాలా(42) మృతితో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రియాంక చోప్రా, లారదత్తాతో పాటు పలువుడు బాలీవుడ్‌ తారలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. శుక్రవారం ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆధారలేవి లేవని, మృతికి ఇంకా కారణాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.

అసలేం జరిగిందంటే.. 
శుక్రవారం రాత్రి షెఫాలి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమె భర్త పరాగ్‌ త్యాగి ఆమెను అంథేరిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. అమె కార్డియాక్‌ అరెస్ట్‌తో మృతి చెందినట్లు తొలుత వార్తల వచ్చాయి. కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం వాటిని ధ్రువీకరించలేదు.

పోలీసులు ఏం చెబుతున్నారంటే.. 
షఫాలీ మృతిపై తాజాగా ముంబై పోలీసులు అప్‌డేట్‌ ఇచ్చారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదని, ప్రస్తుతం అనుమానాస్పద ఘటనగానే పరిగణలోకి తీసకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ‘అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మాకు సమాచారం వచ్చింది. అంధేరీలోని షఫాలి నివాసంలో ఆమె మృతదేహాన్ని పరిశీలించాం. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని కూపర్‌ ఆస్పత్రికి తరలించాం. మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆమె అపార్ట్‌మెంట్‌లో ఫోరెన్సిక్‌ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఇంట్లో పని చేస్తున్న వారిని, వంట మనిషిని ప్రశిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే అనుమానస్పద ఘటనగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని ముంబై పోలీసులు తెలిపారు.

రీమిక్స్ సాంగ్‌తో ఫేమస్‌.. 
2002లో వచ్చిన ‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్‌తో ఫేమస్‌ అయింది షెఫాలి. ఈ గుర్తింపుతోనే సినిమా అవకాశాలు వచ్చాయి. సల్మాన్‌ ఖాన్‌ ముజ్సే షాదీ కరోగా చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం పలు టీవీ రియాలిటీ షోలతో పాపులారిటీ సంపాదించుకుంది. హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొని అలరించింది. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్‌ సింగ్‌ని వివాహం చేసుకుంది. 2009లో అతనితో విడాకులు తీసుకొని.. 2015లో నటుడు పరాగ్‌ త్యాగిని రెండో వివాహం చేసుకుంది. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)