Breaking News

ఆడవాళ్లపై ఇలాంటి ట్రోల్సా? చెండాలం: యాంకర్‌ ఫైర్‌

Published on Sun, 02/01/2026 - 17:18

ఒకప్పుడు ఆడ, మగ క్లోజ్‌గా కనిపిస్తే చాలు వాళ్ల మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ జరుగుతోందని రూమర్స్‌ వచ్చేవి. కానీ, ఇప్పుడు కేవలం కలిసి కనిపించినా సరే.. ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని ప్రచారం చేస్తున్నారు. క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌, యాంకర్‌ షెఫాలి బగ్గా డిన్నర్‌కు వెళ్లడంతో వీరు లవ్‌లో ఉన్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఒక ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) పోస్టర్‌ వైరలవుతోంది.

యాంకర్‌ ఫైర్‌
ఇందులో చాహల్‌ కుర్చీలో కూర్చోగా అతడి పక్కన మాజీ భార్య ధనశ్రీ వర్మ, ఆర్జే మహవశ్‌, షెఫాలి ఉన్నారు. ఈ ఫోటో మొదట చాహల్‌ కంట పడింది. అది చూసిన అతడు ఇంకో ఇద్దరు ముగ్గుర్ని మిస్‌ అయ్యారంటూ సెటైర్లు వేశాడు. తాజాగా ఈ ఏఐ పోస్టర్‌పై షెఫాలి మండిపడింది. ఇదెంత చెండాలం.. ఆడవారిని ఇలా చూపించడం సిగ్గుచేటు. మీ మనస్తత్వం ఎలాంటిదో ఇక్కడే తెలిసిపోతుంది. మీ పనేదో మీరు చూసుకుంటే బెటర్‌ అని కౌంటరిచ్చింది.

పెళ్లి- విడాకులు
ఇకపోతే చాహల్‌.. కొరియోగ్రాఫర్‌, డ్యాన్సర్‌ ధనశ్రీ వర్మను 2020లో పెళ్లి చేసుకున్నాడు. విభేదాలు రావడంతో 2024లో విడిపోయారు. 2025లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యాంకర్‌ ఆర్జే మహవశ్‌తో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, సడన్‌గా ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో బ్రేకప్‌ అయిపయిందని నెటిజన్లు ఫిక్స్‌ అయిపోయారు. 

బిగ్‌బాస్‌తో ఫేమస్‌
అనంతరం షెఫాలీతో కనిపించడంతో మళ్లీ ప్రేమలో పడ్డాడని పలువురు భావించారు. కానీ ఇప్పుడు యాంకర్‌ ఇచ్చిన కౌంటర్‌తో అదంతా ఉట్టి ప్రచారమే అని తేలిపోయింది. కాగా షెఫాలి న్యూస్‌ యాంకర్‌. హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌లో పార్టిసిపేట్‌ చేయడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

చదవండి: అల్లు శిరీష్‌ బ్యాచిలర్‌ పార్టీ

Videos

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)