Breaking News

మేము పెళ్లి చేసుకోలేదు, సహజీవనం చేశాం.. ఇప్పుడు మాత్రం..

Published on Mon, 03/18/2024 - 11:31

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బబ్లూ పృథ్వీరాజ్‌. ఓ పక్క సినిమాలు చేస్తూనే అడపాదడపా సీరియల్స్‌లోనూ యాక్ట్‌ చేశాడు. మధ్యలో కాస్త వెనుకబడ్డ నటుడు ఈ మధ్యే మళ్లీ దూకుడు పెంచాడు. వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే పృథ్వీరాజ్‌ గతంలో బీనాను పెళ్లాడాడు. వీరికి అహద్‌ మోహన్‌ జబ్బర్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇతడు ఆటిజంతో బాధఫడుతున్నాడు.

బ్రేకప్‌ రూమర్స్‌..
కొన్నేళ్లపాటు బాగానే ఉన్న పృథ్వీరాజ్‌-బీనా మధ్య గొడవలు ఎక్కువవడంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత శీతల్‌ అనే తెలుగమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ సహజీవనం చేశారు. 56 ఏళ్ల వయసులో నటుడు సీక్రెట్‌గా ఆమెను పెళ్లి చేసుకున్నాడని ప్రచారం జరిగింది. ఇంతలోనే వీరి బంధం బీటలు వారిందని కొంతకాలంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. బబ్లూ తనకు ప్రపోజ్‌ చేసిన వీడియో శీతల్‌ డిలీట్‌ చేయడంతో ఈ రూమర్స్‌ మరింత బలపడ్డాయి. తాజాగా తన బ్రేకప్‌ నిజమేనని అంగీకరించింది శీతల్‌. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టి క్లారిటీ ఇచ్చింది.

మేము పెళ్లి చేసుకోలేదు..
'చాలామంది నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎన్నో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏదేదో ఊహించుకుంటున్నారు. పృథ్వీ, నేను పెళ్లి చేసుకోలేదు. సహజీవనం చేశామంతే! మేము ఊహించినట్లుగా మా రిలేషన్‌షిప్‌ ముందుకు వెళ్లలేదు. అయితే ఈ ప్రయాణంలో మేము సంతోషాన్ని పంచుకున్న క్షణాలెన్నో ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే మేము విడిపోయాము. జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవిస్తూ, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించరని ఆశిస్తున్నాను' అని రాసుకొచ్చింది.

చదవండి:  కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్‌కి పెళ్లయిపోయింది

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)