Breaking News

కడుపుతో ఉన్న భార్య కోసం ఆరాటం.. జైల్లో ఉండగా నటుడు ఏం చేశాడంటే?

Published on Thu, 02/20/2025 - 12:08

సంజయ్‌దత్‌ (Sanjay Dutt) జీవితంలో ఆకాశమంత విజయాల్ని చూశాడు. జైలు జీవితం, డ్రగ్స్‌కు బానిసవడంతో తన పతనాన్నీ చూశాడు. క్యాన్సర్‌తో పోరాడి వారియర్‌గా గెలిచాడు. వైవాహిక జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు చూశాడు. మొదటి భార్య రిచా బ్రెయిన్‌ ట్యూమర్‌తో మరణించగా రెండో భార్య రియా పిల్లైతో ఎంతోకాలం కలిసుండలేకపోయాడు. ప్రస్తుతం మూడో భార్య మాన్యతతో కలిసి జీవిస్తున్నాడు.

గర్భంతో భార్య.. జైలుకు సంజయ్‌
అయితే మాన్యత (Maanayata) గర్భం దాల్చినప్పుడు సంజయ్‌ చిక్కుల్లో పడ్డాడు. 1993 ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలో నిందితుల నుంచి అక్రమంగా ఆయుధాలను తీసుకున్న కేసులో సంజయ్‌ దత్‌ దోషిగా తేలాడు. దీంతో ఐదేళ్లపాటు జైలుశిక్ష అనుభవించి 2016లో రిలీజయ్యాడు. అయితే సంజయ్‌ జైల్లో ఉన్నప్పుడు మాన్యత ప్రెగ్నెంట్‌. అలాంటి సమయంలో ఆమెను ఒంటరిగా వదిలేయాల్సి వచ్చినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని తన బెస్ట్‌ ఫ్రెండ్‌, నటి షీబా ఆకాశ్‌దీప్‌ (Sheeba Akashdeep)ను ఆదేశించాడు. 

సంజయ్‌ దత్‌-మాన్యత, షీబా ఆకాశ్‌దీప్‌

ఫ్రెండ్‌ సాయం కోరిన నటుడు
ఈ విషయాన్ని షీబా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. జైలుకు వెళ్లేముందు సంజు నాతో మాట్లాడాడు. మాన్యత ఒంటరిగా ఉంది. తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే! అని నాపై భారం వేశాడు. సంతోషంగా అంగీకరించాను. ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్లేదాన్ని. తనతో కూర్చుని మాట్లాడేదాన్ని. ఒంటరితనం ఫీలవకూడదని నావంతు ప్రయత్నించాను. సంజూ బయటకు వచ్చేంతవరకు నేను తనతోనే ఉన్నాను. తొమ్మిది నెలలపాటు మాన్యతకే సమయం కేటాయించాను అని చెప్పుకొచ్చింది. 

తప్పదని తెలిశాక..
2010 అక్టోబర్‌లో మాన్యత కవలపిల్లలకు జన్మనిచ్చింది. జైలు జీవితం గురించి సంజయ్‌దత్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను మొదటిసారి థానే జైలుకు వెళ్లినప్పుడు అక్షయ్‌ కుమార్‌, షారూఖ్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌.. ఇలా అందరూ వచ్చారు. జైలు బయట వీరు నాతో మాట్లాడిన ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి. జైలు జీవితం నుంచి తప్పించుకోలేను అని తెలిసినప్పుడు దాని గురించి అతిగా ఆలోచించడం దేనికనుకున్నాను. 

ఎంతో నేర్చుకున్నా..
అన్నింటికీ సిద్ధంగా ఉండాలనుకున్నాను. ఏం జరిగినా స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. ఐదేళ్ల జైలు జీవితంలో ఎంతో నేర్చుకున్నాను. ఆ సమయంలో వంట చేయడం కూడా నేర్చుకున్నాను. వర్కవుట్స్‌ కూడా చేసేవాడిని అని పేర్కొన్నాడు. సంజయ్‌ జీవిత కథ ఆధారంగా సంజు అనే సినిమా తెరకెక్కింది. బాలీవుడ్‌లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం విలన్‌గా అలరిస్తున్నాడు. కేజీఎఫ్‌, డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రాలతో సౌత్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

చదవండి: ప్రేమించిన వ్యక్తి కోసం సారిక చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది: నటుడు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)