Breaking News

రోజుకు మూడుసార్లు వంటగదిలో పని చేయాలన్నాడు: సీనియర్‌ నటి

Published on Thu, 05/16/2024 - 16:44

ప్రేమపెళ్లిళ్లు అనేవి బాలీవుడ్‌లో ఎప్పటినుంచో ఉన్నవే! మనసులు కలిశాక మనుషులు ఒక్కటైన సంఘటనలు కోకొల్లలు. బాలీవుడ్‌ సీనియర్‌ జంట షర్మిల ఠాగోర్‌- మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీలు కూడా ఇదే కోవలోకి వస్తారు. వీరిద్దరూ ప్రేమ బంధాన్ని 1968లో పెళ్లితో పదిలపర్చుకున్నారు.

కిచెన్‌లోకి నో
పెళ్లైన కొత్తలో జరిగిన విషయాలను తాజాగా ఓ షోలో గుర్తు చేసుకుంది షర్మిల. 'నా భర్త నన్ను రోజుకు మూడుసార్లు వంటగదికి వెళ్లాలని చెప్పాడు. ఇది చాలా చెడ్డ ఆలోచన.. నేను అన్నిసార్లు కిచెన్‌కు వెళ్లానంటే నీకే కష్టమవుతుందని భర్తకు వార్నింగ్‌ ఇచ్చాను. ఇదెక్కడుంది? ఆ వస్తువు ఎక్కడుంది? నాకు ఏదీ దొరకడం లేదంటూ నీ వెంటే పడతానని హెచ్చరించాను.

అతడే స్వయంగా..
దానికంటే నేను వంటగదికి వెళ్లకపోవడమే మేలని చెప్పాను. దీంతో అతడు తన వంట తానే చేసుకోవాల్సి వచ్చింది. నేను తెలివిగా అతడు వంటగదిలోకి వచ్చేలా చేశాను. ఏమాటకామాట కిచెన్‌లో అద్భుతాలు చేసేవాడు. యూట్యూబ్‌లో చూసి కొత్తరకం వంటలు చేసేవాడు. దానివల్ల తను మరింత కాన్ఫిడెంట్‌గా తయారయ్యాడు. 

అద్భుతంగా వండుతాడు
ఓసారి నేను లండన్‌లో ఉన్నప్పుడు ఒకరు నాకు కాల్‌ చేసి నీ భర్త వంట ఎంత సూపర్‌గా చేశాడో.. అని కాంప్లిమెంట్‌ ఇచ్చారు. నేను కిచెన్‌లోకి వెళ్లకపోవడం వల్లే అతడు అమోఘంగా వంటలు చేయగలిగాడు' అని షర్మిల చెప్పుకొచ్చింది. మన్సూర్‌ అలీ ఖాన్‌- షర్మిల ఠాగోర్‌లకు సైఫ్‌, సబా, సోహా అలీ ఖాన్‌ అని ముగ్గురు సంతానం. కాగా క్రికెటర్‌ మన్సూర్‌ 2011లోనే కన్నుమూశాడు.

చదవండి: భర్తతో విడాకులు ప్రకటించిన తెలుగు నటి.. అర్థం చేసుకోండంటూ..

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)